Telugu News » Blog » కమెడియన్ ప్రియదర్శి విలన్ గా కూడా నటించాడు అన్న సంగతి తెలుసా…? ఆ సినిమాలు ఇవే..?

కమెడియన్ ప్రియదర్శి విలన్ గా కూడా నటించాడు అన్న సంగతి తెలుసా…? ఆ సినిమాలు ఇవే..?

by AJAY
Ads

ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉన్న కమెడియన్స్ లో ప్రియదర్శి కూడా ఒకరు. పెళ్లిచూపులు సినిమాలో ప్రియదర్శి హీరోకు స్నేహితుడి పాత్రలో నటించి చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ చిత్రంలో నా సావు నేను సస్తా నీకెందుకు అంటూ ప్రియదర్శి చెప్పిన డైలాగ్ చాలా వైరల్ అయింది. ఈ సినిమా తర్వాత ప్రియదర్శి వరుస ఆఫర్లు అందుకున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లోనూ ప్రియదర్శి ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నాడు.

Advertisement

Advertisement

అయితే కేవలం కమెడియన్ గానే కాకుండా ప్రియదర్శి నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మల్లేశం సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. కామెడీ తో పాటు ప్రియదర్శి ఎమోషన్ ను కూడా పండించగలడు అని నిరూపించుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రియదర్శి విలన్ గా కూడా నటించాడు అన్న సంగతి చాలా మందికి తెలియదు.

Advertisement

ప్రియదర్శి మొట్టమొదట టెర్రర్ అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమాలో శ్రీకాంత్ హీరోగా నటించాడు. కాగా ఈ సినిమాలో ప్రియదర్శి విలన్ గా నటించాడు. అంతేకాకుండా ప్రియదర్శి బొమ్మలరామారం అనే సినిమాలను విలన్ గా నటించాడు. కానీ ప్రియదర్శి విలన్ గా నటించిన సినిమాలు ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. దాంతో విలన్ గా సక్సెస్ ను అందుకోలేకపోయాడు.

You may also like