టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, విలన్ గా ఎంతో గుర్తింపును తెచ్చుకున్నారు రియల్ స్టార్ శ్రీహరి. ఇక ఆయన గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో అద్భుతమైన పాత్రలో హీరోగా విలక్షణ నటుడిగా నటించిన శ్రీహరి డిస్కోశాంతిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో డైరెక్టర్ నిమ్మల శంకర్ తో శ్రీహరికి ఎంతో పరిచయముండేది. ఈ తరుణంలో దర్శకుడు శంకర్ ఓ ఇంటర్వ్యూలో శ్రీహరి, తన భార్య డిస్కో శాంతి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
Advertisement
Advertisement
ముఖ్యంగా భద్రాచలం శ్రీహరి సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఎంతో కష్టంగా ఉండేదట. ఓ యాక్షన్ సన్నివేశంలో శ్రీహరిని తలకిందులుగా వేలాడదీసే సన్నివేశాలను తెరకెక్కించాల్సి ఉంది. ఇలాంటి సన్నివేశాలను తెరకెక్కించే సమయంలో డిస్కోశాంతి నా భర్తకు చంపేస్తావా ఏంటి..? అంటూ అలాంటి సన్నివేశాలను తీయడానికి అభ్యంతరం తెలిపేది అని ఈ సందర్భంగా దర్శకుడు తెలియజేశారు. శ్రీహరి నాకు ఎంతో చనువు ఉండడం వల్ల తను ఈ విధమైనటువంటి సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు తన తిరుగుతుందని మేమిద్దరం అనుకునేవాళ్లం.
తాను మమ్ముల్ని తిడుతూ మాకు శాపాలు కూడా పెట్టేవారని ఇంటర్వ్యూలో చెప్పారు శంకర్. ఇక శ్రీహరి ఎంతో అద్భుతంగా మోహన్‌బాబు డైలాగులు చెప్పేవారని ఈ సందర్భంగా శంకర్ తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీహరి అనారోగ్య సమస్యలతో మృతిచెందారు. ప్రస్తుతం ఆయన కొడుకులు సినీ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
Also Read : జీరో రూపాయి నోటు ఉందని మీకు తెలుసా..? దానిని ఎందుకు ఉపయోగిస్తున్నారంటే..?