చిత్ర పరిశ్రమలో సెలబ్రెటీ జంటలు విడిపోతున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అతి తక్కవ కాలంలో పలువురు స్టార్ కపుల్స్ విడిపోతున్నట్టు ప్రకటించారు. రీసెంట్ గా తమిళ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీరి విడాకుల వార్తను కోలీవుడ్ ప్రేక్షకులు మర్చిపోకముందే ఇప్పుడు మరోజంట విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. తమిళ స్టార్ డైరెక్టర్ బాల తన భార్య మధుమలార్ తో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు.
Advertisement
Advertisement
నాలుగేళ్ల క్రితమే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఇప్పుడు తాము విడిపోతున్నట్టు ఈ జంట అధికారికంగా ప్రకటించడంతో కోలీవుడ్ లో సంచలనం గా మారింది. నాలుగేళ్ల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు రాగా అప్పటి నుండి ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ కోర్టులో వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా తాజాగా వారికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇదిలా ఉండగా బాల మధురబాల 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ప్రార్థన అనే కూతురు ఉంది. ఇక తాజాగా ఈ జంట తమ పదిహేడేళ్ల వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టేసింది.