టీం ఇండియా సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఇప్పుడు భారత జట్టులో ముఖ్యమైన ఆటగాడిగా మారాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2022 కంటే ముందు అసలు.. దినేష్ పని అయిపోయింది అని.. ఇక రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే అని చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ దినేష్ రిటైర్మెంట్ అయితే ఇవ్వలేదు కానీ.. ఐసీసీ కామెంట్రీలో చేరిపోయాడు. ఇక అప్పటి నుండి ప్రతి విషయంలో దినేష్ తన స్పందన అనేది తెలియజేస్తున్నాడు. అయితే ప్రస్తుతం మన ఇండియన్ టీం అనేది ఇంగ్లాండ్ లో ఉంది. అక్కడ గత ఈఏడాది మిగిలిపోయిన టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది.
Advertisement
అయితే నిన్న ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్ ను భార్త జట్టు దారుణంగా ప్రారంభించింది. కేవలం 98 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. అందువల్ల టీం ఇండియా 200 చేస్తే గొప్ప అనుకున్నారు. కానీ అప్పుడే క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ ఒక్కసారిగా గేమ్ గేర్ అనేది మార్చేశాడు. అసలు పంత్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఇది టెస్ట్ క్రికెట్ అనే విషయాన్ని మర్చిపోయారు ఫ్యాన్స్. ప్రతి ఓవర్లో బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. పంత్ కు తోడు మరోవైపు జడేజా నిలకడ రాణిస్తూ వస్తున్నాడు. ఇక జడేజా సహకారంతో మరింత రెచ్చిపోయిన పంత్ 111 బంతుల్లో 146 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికి మొదటి రోజు ముగిసింది.
Advertisement
దాంతో నిన్నటి మ్యాచ్ యొక్క హైలెట్స్ ను యూట్యూబ్ లో ఉంచింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. కానీ దానికి టైటిల్.. పంత్ ను ఔట్ చేసిన రూట్ అని ఇచ్చింది. ఇక ఈ టైటిల్ పై మన దినేష్ కార్తీక్ సెటైర్స్ అనేవి పేల్చాడు. ”అటువంటి ఆకట్టుకునే అద్భుతమైన బ్యాటింగ్ తర్వాత… ఇంగ్లాండ్ బోర్డు ఇంతకంటే మంచి టైటిల్ పెట్టవచ్చు. కానీ రిషబ్ పంత్ తో పాటుగా రెండు జట్లు ఇంత మంచి క్రికెట్ ఆడిన తర్వాత కూడా ఇంగ్లాండ్ బోర్డుకు మంచి టైటిల్ రానట్లుంది” అని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. మాములుగా ఇలా టైటిల్స్ లో ఎవరు టాప్ పెరఫార్మెన్స్ ఇస్తే వారి గురించి పెడతారు. కానీ ఈసీబీ మాత్రం ఆలా పెట్టకపోవడంతో కార్తీక్ ఇలా కౌంటర్ ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి :