Ad
భారత సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అనుకున్నది సాధించాడు అనే చెప్పాలి. వచ్చే నెల నుండి ఆస్ట్రేలియాలో ప్రారంభం కాబోతున్న టీ20 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కార్తీక్ కు చోటు అనేది దక్కింది. దాంతో నానా కల నెరవేరింది అని పేర్కొన్నాడు కార్తీక్. అయితే 2019 ప్రపంచ కప్ తర్వాత జట్టులో చోటు అనేది కోల్పోయిన కార్తీక్… కామెంటేటర్ గా మారిపోయాడు.
అలా భారత జట్టు ఆడిన మ్యాచ్ లకు వ్యాఖ్యానం అందించాడు. ఇక అతని పని అయ్యిపోయింది అనుకున్న సమయంలో ఐపీఎల్ 2022 మెగవేలంలో ఆర్‌సీబీ జట్టు అతడిని కొనుగోలు చేయడం.. ఈ సీజన్ లో దినేష్ కార్తీక్ చెలరేగిపోవడం.. మళ్ళీ అతనికి భారత జట్టు నుండి పిలుపు రావడం అన్ని చక చక జరిగిపోయాయి. ఇక ఇప్పుడు దినేష్ ప్రపంచం కప్ కు సెలక్ట్ కావడంతో ఆర్‌సీబీ యాజమాన్యం.. అతని గురించి ఓ వీడియో అనేది పోస్ట్ చేసింది.
ఇక ఆర్‌సీబీ యొక్క వీడియో పైన దినేష్ కార్తీక్ స్పందిస్తూ.. ఇదంతా మీ వల్లే జరిగింది. మిరే నా జర్నీలో ముఖ్య పాత్ర. ఆర్‌సీబీ ఫ్యాన్స్ అయితే నేను ఇండియాకు ఆడుతున్న కూడా ఆర్‌సీబీ, ఆర్‌సీబీ అంటూ నన్ను ఎంకరేజ్ చేసారు. మీ వల్లే ఈరోజు నా కల అనేది తీరింది అని పేర్కొన్నాడు కార్తీక్. చూడాలి మరి ఈ టోర్నీలో దినేష్ ఎలా ఆడుతాడు అనేది.
ఇవి కూడా చదవండి :
మొదటికొచ్చిన పంత్, ఊర్వశీ వ్యవహారం..!
కోహ్లీకి రిటైర్ సలహా ఇస్తున్న పాక్ క్రికెటర్..!
Advertisement