Home » కోహ్లీకి రిటైర్ సలహా ఇస్తున్న పాక్ క్రికెటర్..!

కోహ్లీకి రిటైర్ సలహా ఇస్తున్న పాక్ క్రికెటర్..!

by Azhar
Ad

భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తాజాగా ముగిసిన ఆసియా కప్ తో ఫామ్ లోకి వచ్చాడు అనే విషయం అందరికి తెలిసిందే. ఒక్క ఏడాదిగా పరుగులు చెయ్యలేక.. మూడేళ్ళుగా సెంచరీ లేక నెట్టుకు వస్తున్న విరాట్.. ఒక్క ఈ ఆసియా కప్ లోనే ఈ రెండు కొరియాలు తీర్చుకున్నాడు. అయితే కోహ్లీ ఫామ్ లో లేని సమయంలో భారత మాజీ ఆటగాళ్లు ఎక్కువగా విమర్శిస్తుంటే.. బయటి దేశం ఆటగాళ్లు మద్దతుగా నిలిచారు.

Advertisement

ముఖ్యంగా మన శత్రు దేశం అయిన పాకిస్థాన్ మాజీలతో పాటుగా ఇప్పుడు ఆడుతున్న అఆటగాళ్లు కూడా కోహ్లీకి తమ మద్దతు అనేది ప్రకటించారు. కానీ కోహ్లీ ఇప్పుడు ఫామ్ లోకి వచ్చినా తర్వాత అతను రిటైర్ కావాలని సలహాలు ఇస్తున్నాడు. మొదట షాహిద్ ఆఫ్రిది కోహ్లీ ఫామ్ లో ఉండగానే ఆటాగాకు వీడ్కోలు పలకాలి అని చెప్పగా.. ఇప్పుడు షోయబ్ అక్తర్ కూడా అదే రకమైన కామెంట్స్ చేస్తున్నాడు.

Advertisement

తాజాగా అక్తర్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఈ ప్రపంచ కప్ తర్వాత టీ20 లకు గుడ్ బై చెప్తాడు అని నేను అనుకుంటున్నాను. నేను కోహ్లీ అయితే అలానే చేసేవాడిని. ఏ పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికి టెస్ట్, వన్డేల పైన ఫోకస్ చేసేవాడిని అని చెప్పాడు. అయితే పాక్ మాజీలు చేస్తున్న ఈ కామెంట్స్ చూస్తుంటే.. కోహ్లీ ఫామ్ లోకి రావడంతో పాక్ కు భయం పట్టుకుంది అని భారత అభిమానులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి :

గంగూలీకి ఉపశమనం కలిపించిన సుప్రీంకోర్టు..!

గంగూలీ పదవికి జై షా ఎసరు..?

Visitors Are Also Reading