Home » దిల్ రాజు తేజస్విని రెండో పెళ్లి వెనుక ఇంత స్టోరీ నటించింది… వీరి లవ్ స్టోరీ మామూలుగా లేదు!

దిల్ రాజు తేజస్విని రెండో పెళ్లి వెనుక ఇంత స్టోరీ నటించింది… వీరి లవ్ స్టోరీ మామూలుగా లేదు!

by Bunty
Published: Last Updated on
Ad

దిల్ సినిమాతో టాలీవుడ్ లో నిర్మాతగా పరిచయమయ్యారు దిల్ రాజు. తన తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దిల్ సినిమాకు ముందు నైజాం డిస్ట్రిబ్యూటర్ గా రాజు ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే అప్పటి వరకు రాజును అందరూ నైజాం రాజు అని పిలిచేవారు. దిల్ సక్సెస్ తర్వాత అందరూ దిల్ రాజు అని పిలవడం ప్రారంభించారు. అదే పేరు పాపులర్ అయిపోయింది.

READ ALSO : Kalyanam Kamaneeyam Telugu Review : కళ్యాణం కమనీయం రివ్యూ

Advertisement

 

దిల్ తర్వాత కొన్ని సూపర్ హిట్ సినిమాలను నిర్మించి, టాలీవుడ్ లో తిరుగులేని నిర్మాతగా ఎదిగారు. ఇక రెండేళ్ల కిందట దిల్ రాజు తేజస్విని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించారు. ఇలా నాలుగు పదుల వయసులో దిల్ రాజు రెండో వివాహం చేసుకొని ఓ బిడ్డకు జన్మనివ్వడం గమనార్హం. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా కేవలం తన సినిమాల గురించి మాత్రమే ప్రస్తావించే దిల్ రాజు ఎప్పుడు కూడా తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటానికి ఇష్టపడరు.

Advertisement

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తేజస్వినినీ రెండో వివాహం చేసుకోవడానికి గల కారణం ఏంటి, అసలు తనతో పరిచయం ఎలా ఏర్పడిందనే విషయాల గురించి చెప్పుకొచ్చారు. తన భార్య అనిత మరణించిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డానని, అయితే తన జీవితంలో మళ్ళీ ముందుకు వెళ్లాలంటే కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. కానీ నా బిజీ షెడ్యూల్ ను అర్థం చేసుకునేవారు కావాలనుకున్నాను. అదే సమయంలో ఒకరోజు విమానంలో ప్రయాణిస్తుండగా తనకు తేజస్విని పరిచయమయ్యారని, తన నెంబర్ తీసుకొని తనను అర్థం చేసుకోవడానికి దాదాపు సంవత్సరం సమయం పట్టిందని, అనంతరం తనకి ప్రపోజ్ చేయడం, ఆ తర్వాత కుటుంబ సభ్యులతో చెప్పి మా వివాహానికి ఒప్పించిన అనంతరం మా పెళ్లి జరిగిందని ఈ సందర్భంగా దిల్ రాజు తన రెండో పెళ్లి వెనుక ఉన్న స్టోరీ మొత్తం చెప్పారు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

READ ALSO : తండ్రి అయిన టాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ

Visitors Are Also Reading