Home » కుండ నీటికి, బాటిల్ నీటికి మధ్య తేడాలు.. ఏ నీరు మంచిదంటే..!

కుండ నీటికి, బాటిల్ నీటికి మధ్య తేడాలు.. ఏ నీరు మంచిదంటే..!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. అడుగు బయట పెట్టాలంటే జనాలు భయపడుతున్నారు. దీంతో ఏమైనా పనులు ఉంటే ఉదయం లేదా సాయంకాల సమయంలోనే చేసుకుంటున్నారు. అంతటి ఎండ నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం నీరు ఎక్కువగా తాగాలి. దీనివల్ల శరీరం చల్లగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఏ నీటిని తాగితే మనకు ఆరోగ్యంగా ఉంటుంది. కుండ నీరా లేదా బాటిల్ నీరా.. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఫ్రిజ్ లో పెట్టిన బాటిల్ నీరే మంచిది అని అనుకుంటారు. మరి ఇందులో ఏది మంచిదో తెలుసుకుందాం..!

Advertisement

కుండ నీరు: వేసవి కాలం వచ్చిందంటే నీరు చెమట రూపంలో బయటకు పోతుంది. కాబట్టి ఎక్కువగా మనం వాటర్ తాగాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. వీలైనంత వరకు కుండ నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేయాలి. మట్టిలో ఆల్కలైన్ ఉంటుంది కాబట్టి మనం కుండలో నీరు నింపినప్పుడు ఆమ్లాలను దరిచేరకుండా చూసుకుంటుంది. దీని వల్ల మనకి అసిడిటి సమస్య అనేది ఉండదు. అందుకే మట్టి కుండలో వండిన ఆహార పదార్థాలు తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు ఉండవు. కుండ నీరు శరీరం యొక్క మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. దీంతో పాటుగా గొంతుకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి కుండ నీరు శరీరానికి ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

Advertisement

బాటిల్ నీరు: మనం బాటిల్ నీరు తాగడం వల్ల ముఖ్యంగా రోగనిరోధకశక్తి దెబ్బతింటుంది. అలాగే ప్లాస్టిక్ లో ఉండేటువంటి తాలెట్స్ అనే రసాయనాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవే కాకుండా ప్లాస్టిక్ లో అర్సెనిక్, ఫ్లోరైడ్ ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల శరీరంలో విషపూరిత పదార్థాలు పెరిగిపోతాయి. అలాగే ఈ బాటిల్ నీటిలో బిపిఏ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. అందుకే ప్లాస్టిక్ బాటిల్ నీరు వద్దు..కుండలో నీరు ముద్దు అంటున్నారు పెద్దలు..

Visitors Are Also Reading