Home » చిరంజీవి కి మోహన్ బాబు కి మధ్య ఉన్న తేడా ఇదే..!

చిరంజీవి కి మోహన్ బాబు కి మధ్య ఉన్న తేడా ఇదే..!

by Sravya
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఏకంగా 150 కి పైగా సినిమాలు చేసి చిరంజీవి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ఇక మోహన్ బాబు విషయానికి వస్తే మోహన్ బాబు కూడా మంచి నటుడు ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు మోహన్ బాబు. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతని చాటుకున్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి అలానే మోహన్ బాబు కూడా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో వేరియేషన్స్ లో ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ ని అందుకున్న మూవీస్ అలానే పొందిన అవార్డులు ఇవన్నీ కూడా ఆయన్ని నెక్స్ట్ రేంజ్ లో నిలబెట్టేసాయి.

mohanbabu

Advertisement

 

ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ కూడా చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి విలన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా మోహన్ బాబు ఎదిగారు.

Advertisement

ఈయన మంచి నటుడు అయినప్పటికీ చిరంజీవి అంత గుర్తింపుని తెచ్చుకోలేకపోయారు మోహన్ బాబు సినీ ఇండస్ట్రీలో ఉండే విషయాల మీద నిక్కచ్చిగా మాట్లాడుతూ ఎవరిని పడితే వాళ్ళని దూషిస్తూ ఉంటారు. అందుకే మోహన్ బాబు ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ సంపాదించలేకపోయారు. చిరంజీవి మాత్రం ఏ విషయం మీద స్పందించిన ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడతారు.

వ్యక్తిత్వం వలన చిరంజీవి టాప్ రేంజ్ లో ఉన్నారు అని కొంతమంది అంటూ ఉంటారు ఇది మోహన్ బాబు కి చిరంజీవికి మధ్య ఉన్న పెద్ద తేడా. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కూడా కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నారు. సరైన హిట్ కోసం ప్రస్తుతం ట్రై చేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య మంచి సక్సెస్ ని ఇచ్చింది అయితే మళ్లీ మంచి సక్సెస్ ని అందుకోవాలని చిరంజీవి ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి రీమేక్ సినిమాలకి దూరంగా ఉంటే మంచిది అని చిరంజీవి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరి ముందు ముందు చిరంజీవి ఫ్యాన్స్ ని ఎలా ఇంప్రెస్ చేస్తారు ఎటువంటి సినిమాల్లో నటిస్తారనేది చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading