ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న సినిమా కాంతార. భారీ బడ్జెట్ సినిమాలు…భారీ వీఎఫ్ఎక్స్ తో తీసిన సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్ లకు రప్పిస్తాయని అనుకుంటున్న సమయంలో కాంతార సినిమా ఆ ముచ్చట్లన్నీ ఫేక్ అని నిరూపించింది. నిజానికి కాంతార కన్నడ చిత్రం. ఈ సినిమాను ముందుగా అక్కడ మాత్రమే రిలీజ్ చేశారు. కాగా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.
దాంతో ఆ తరవాత ఇతర భాషల్లో ఓటిటి లో విడుదల చేయాలని మొదట భావించారు. కానీ బజ్ చూసి థియేటర్ లలోనే విడుదల చేశారు. దాంతో థియేటర్ లలో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కేజీఎఫ్ తరవాత మళ్లీ ఆ రేంజ్ లో కాంతార కలెక్షన్స్ ను రాబడుతోంది. కాంతార అంటే అసలు అర్థం అడవి అని.
Advertisement
Advertisement
అడవిలోని ఓ తెగవాళ్లకు చెందిన ఆచారాన్ని ఈ సినిమాలో చూపించారు. అయితే వారి ఆచారాలతో పాటూ కమర్షియల్ హంగులను అద్ది దర్శకుడు రిషబ్ శెట్టి కథను రాసుకున్నాడు. ఈ సినిమాలో హీరోగా కూడా రిషబ్ శెట్టినే నటించాడు. సినిమాలో రిషబ్ శెట్టి నటనతో పాటూ కథ కథనం అద్భుతంగా ఉన్నాయి.
అయితే ఇదే కాన్సెప్ట్ గా గతంలో కూడా కన్నడలో ఓ సినిమా వచ్చింది అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆ సినిమా పేరు పింగారా కాగా ఆ చిత్రాన్ని కన్నడ మరియు తులు భాషల్లో తెరకెక్కించారు. ఈ సినిమాలో పీడిత కులాల నిరసనకు వ్యతిరేకంగా పోరాటం చేయడాన్ని చూపించారు. కాంతార సినిమాతో పోలిస్తే పింగారా నిజాయితీ ఉన్న సినిమా అని చూసినవాళ్లు చెబుతుంటారు. కానీ కమర్షియల్ హంగులు లేని కారణంగా పింగారా సినిమాకు పెద్దగా గుర్తింపు రాలేదు ఈ సినిమా కేవలం ఫిలింఫెస్టివెల్ కు మాత్రమే పరిమితం అయ్యింది.