దర్శక ధీరుడు రాజమౌళి పేరు తెలియని వారు లేరు ఇప్పుడు. ఎందుకంటే ఇండియాలోనే గ్రేట్ దర్శకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి పేరు మారు మ్రోగిపోతుంది. కేవలం భారతదేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లో కూడా జక్కన్న సినిమాలకు విపరీతమైన క్రేజ్ నెలకొంది. ముఖ్యంగా బాహుబలి, RRR వంటి సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన డైరెక్టర్ గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. అలాంటి దర్శకుడు రాజమౌళి తన కెరీర్ ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 అని దాదాపు అందరికీ తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది.
Advertisement
ఈ చిత్రం నుంచి తిరుగులేని దర్శకుడిగా ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా పరాజయం కూడా లేని దర్శకుడిగా రాజమౌళి విజయవంతంగా కొనసాగుతున్నారు. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ లో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకి సంబంధించి సరికొత్త వార్త వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్విని దత్ తెలియజేశారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మహేష్ బాబు రాజకుమారుడు, బన్నీగంగోత్రి, రామ్ చరణ్ చిరుత ఇలా ఈ హీరోల మొదటి సినిమాలు మా బ్యానర్ లోనే తెరకెక్కాయి. కానీ ఎన్టీఆర్ ది స్టూడెంట్ నెంబర్ 1 రెండో సినిమా.
Advertisement
వాస్తవానికి ఈచిత్రం తొలుత ప్రభాస్ తో ప్లాన్ చేశారు. కానీ అదే సమయంలో హరికృష్ణ ఫోన్ చేయడంతో మొత్తం ప్లాన్ మారిపోయింది. స్టూడెంట్ నెంబర్ 1 తారక్ చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు అశ్వినిదత్. నిజానికి ప్రభాస్ ఫస్ట్ సినిమా మా బ్యానర్ లోనే రావాల్సింది. కానీ మిస్ అయింది అని వెల్లడించారు నిర్మాత అశ్వనిదత్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా షూటింగ్ జరుపుకుంటున్న మూవీ కల్కీ 2898 ఏడీ మూవీ వైజయంతి మూవీస్ బ్యానర్ లోనే తెరకెక్కుతోంది. ఈ సినిమా ఈ బ్యానర్ కి 50వ సినిమా. నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఆ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను లీక్ చేసిన రకుల్..!