జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం బలగం. ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్లో ఎంతలా నాటుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ చిత్రాన్ని చూసి విడిపోయినటువంటి కుటుంబాలు ఎన్నో కలిసిపోతున్నాయంటే బలగానికి జనాలు ఎంతలా కనెక్ట్ అయ్యారో చెప్పవచ్చు. ఈ చిత్రం విజయం సాధించడంలో వేణు పాత్ర ఎంత ఉందో.. నటీనటులది కూడా అంతే ఉందని చెప్పవచ్చు.
Advertisement
ఈ సినిమాలోని ప్రతీ పాత్ర అత్యంత సహజంగా నటించి మెప్పించారు. అందుకే బలగం చిత్రం ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటుంది. బలగం మూవీలో మరిచిపోలేని పాత్రలలో కొమురయ్య చిన్న కొడుకు మొగిలయ్య పాత్ర ఒకటి. సినిమా చివరిలో మొఘులయ్య పాత్ర నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. అసలు ఈ పాత్రలో నటించిన వ్యక్తి ఎవరో తెలుసా..? ఇతని పేరు మధుసూదన్ అలియాస్ మైమ్ మధు. హన్మకొండకి చెందిన మైమ్ మధు సినీ జీవితం చక్రవాకం సీరియల్ తో ప్రారంభమైంది. చిన్నతనం నుంచి నటన మీద ఆసక్తి ఉన్న మధు ఆకాశవాణి అనే సినిమాలో అద్భుతమైన నటనతో మెప్పించారు.
Advertisement
కేవలం నటనకే పరిమితం కాకుండా మొగలిరేకులు, శ్రావణసమీరాలు వంటి సీరియల్స్ లో లీడ్ రోల్స్ కి డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా శ్రావణసమీరాలు సీరియల్ కి నంది అవార్డు కూడా అందుకున్నారు. యాక్టింగ్ లో శిక్షణ పొందిన మధుసూదన్ పరిణితి సాధిస్తూ మైమ్ మధుగా మారారు. దేశ, విదేశాల్లో పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. హ్యుమన్ రీసెర్చ్ నుంచి స్కాలర్ షిప్ ని అందుకున్నారు. ఆ తరువాత ఇండియన్ మైమ్ అకాడమీ స్థాపించి దేశ, విదేశాల్లో వర్క్ షాపులు ఇచ్చి పలువురు నటులకు మైమ్ లో శిక్షణ ఇచ్చారు. ఆకాశవాణి, గాలి సంపత్, చోర్ బజార్ వంటి చిత్రాలలో నటించారు మధు. ఇక బలగం చిత్రంతో ఇప్పుడు మంచి పాపులర్ అయ్యారు.
Also Read : ప్రశాంత్ నీల్ మూవీపై ఇంట్రెస్ట్ అప్డేట్..!