Home » అల్లంతో ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయనే విషయం మీకు తెలుసా ?

అల్లంతో ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయనే విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

అల్లం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏ కూర చేయాలన్నా అల్లం ఉంటే ఆ టేస్టే వేరు. ముఖ్యంగా ఆహారం రుచిని పెంచి అల్లం పోషకాల్లో నెంబర్ వన్ అని కూడా పిలుస్తారు. అల్లంలో కాల్షియం 21 గ్రాములు ఉంటుంది. అల్లం నీటిలో ఉడికించుకుని తాగితే పైత్యం తగ్గుతుంది. అల్లం నీటిలో తేనె కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. అందులో రెండు చిటికెల పసుపు కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయి. కడుపులో మంట ఉన్నవారు అల్లంను అస్సలు తీసుకోకూడదు.

Advertisement

మనం నిత్యం వంటల్లో వేసే అల్లం ఎంతో పురాతన కాలం నుంచి పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడానికి వాడుతున్నారు. అల్లంతో మన శరీరానికి అవసరమైన కీలక పోషకాలు కూడా ఉన్నాయి. ఇందులో సహజసిద్ధమైన అనాలజిస్ట్రిక్ యాంటి ఇన్ ఫ్లో మెట్రిక్ గుణాలున్నాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసే యాంటి ఆక్సిడెంట్ లో పుష్కలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రతీరోజు ఉదయాన్నే పరగడుపున ఓ గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఓ టీ స్పూన్ అల్లం రసం కలుపుకొని తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారు అల్లం రసం తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.  అదేవిధంగా నొప్పులను తగ్గిస్తాయి. తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. మలబద్ధక సమస్య దూరమవుతుంది. శరీరంలో విషపదార్థాలు బయటికీ వెళ్లిపోతాయి. శరీరంలో ఎక్కువగా నీరు చేరుతుంటే.. అధికంగా ఉన్న నీరు బయటికి వెళ్లిపోతుంది. ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, జ్వరం, తదితర ఇన్ఫెక్షన్లున్నవారు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు అల్లం రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. కండరాలు పట్టేస్తుంటాయి. అలాంటి వారు అల్లం రసం తాగితే ఫలితముంటుంది. ఎందుకు అంటే అల్లంలో ఉండే మినరల్స్ శరీరంలోని ఎలక్ట్రోలైట్ లెవెల్స్ ను బాలెన్స్ చేస్తాయి. దీంతో కండరాలు పట్టేయకుండా ఉంటాయి. అల్లంలో పుష్కలంగా ఉండే ఆంటి ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయవు. దీంతో ఎప్పటికీ యంగ్ గా కనిపిస్తారు. కాబట్టి ప్రతీరోజు పరిగడుపున అల్లం టీ తాగితే.. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మీ స్మార్ట్ ఫోన్ ని ఛార్జింగ్ చేసే విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..?

బ్లూ టీతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే.. మీ రోజువారీ డైట్ లో తప్పకుండా తీసుకుంటారు..!

మొబైల్ కి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎన్ని యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుందో తెలుసా ? 

Visitors Are Also Reading