Home » ప్రముఖ నటి మీనా కుమారి భర్త కూడా టాలీవుడ్ స్టార్ నటుడని మీకు తెలుసా..?

ప్రముఖ నటి మీనా కుమారి భర్త కూడా టాలీవుడ్ స్టార్ నటుడని మీకు తెలుసా..?

by Sravanthi
Ad

ఒకప్పుడు డైలీ సీరియల్ ఆర్టిస్ట్ గా నటించి ఆ సీరియల్ ద్వారా ఎనలేని గుర్తింపు సంపాదించింది. ఇప్పటికీ ఈమె పేరు చెబితే ఓ సీరియల్ హీరోయిన్ కదా అనే విధంగా తన నటనతో అలరించిన యాక్టర్.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరబ్బా అంటే మనందరికీ సుపరిచితురాలైన చి.ల.సౌ.స్రవంతి.. ఈ సీరియల్ లో నటించిన మీనా కుమారి పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ సీరియల్లో ఈమె తన నటనతో అప్పట్లో బుల్లితెర అభిమానులను ఎంతో అలరించింది.

 

Advertisement

దీని తర్వాత సినిమాల్లో కూడా కీలకమైన పాత్రలో నటించి మెప్పించింది. ఈ మీనా కుమారి భర్త కూడా స్టార్ నటుడు అని మనకు ఇప్పటివరకు తెలియదు.. వారు ఎవరయ్యా అంటే.. సీరియల్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న సమయంలోనే తను నటించినటువంటి మొదటి సీరియల్ దర్శకుడైన పులి వాసు ని లవ్ చేసింది మీనా. ఇలా వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పులి వాసు ఎన్నో డైలీ సీరియల్స్ కు దర్శకుడిగా చేశారు.

Advertisement

అప్పట్లో ప్రసారమైన చి.ల.సౌ స్రవంతి, శ్రీమతి కళ్యాణం, మంచుపల్లకీ ఇలా ఎన్నో సీరియల్స్ కు దర్శకుడిగా చేశారు. అలాగే ఆయన సీరియల్స్ కు దర్శకుడిగా చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా డైరెక్షన్ చేశారు. కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి అనే సినిమాకి డైరెక్టర్ గా చేసి వెండి తెరకు పరిచయం అయ్యారు. ఈయన డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా సుబ్బూ,రాజా, సంకల్పం వంటి మూవీస్ లో కూడా నటించాడు. హీరోగా రూపాయి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.

also read;

Visitors Are Also Reading