తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో కొత్త తరహా పాత్రలను పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రధానంగా ఈయన కౌబాయ్, జేమ్స్‌బాండ్ వంటి పాత్రలను పరిచయం చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణ ఒకానొక సమయంలో ఎలాంటి హిట్ సినిమా లేక సతమతమయ్యారట. ఈయన నటించిన 12 సినిమాలు వరుసగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదట. కృష్ణ పరిస్థితి ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉండిపోయారట. కొన్ని సందర్భాల్లో ఆ సినిమానే ఆడలేదు. ఇప్పుడు మీతో సినిమాతో చేస్తే ఇక అంతే సంగతులు అన్నవారు కూడా ఉన్నారట.
Advertisement
ఈయనకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా ఉండడమే కాకుడా ఈయన నటించిన సినిమాలు హిట్ కాకపోవడంతో చాలా మంది ఇండస్ట్రీలో ఇతన్ని నువ్వు హీరోగా అసలు పనికి రావు అని.. నీకు సినిమా అవకాశాలు ఇక రావని పెద్ద ఎత్తున హేళన చేశారట. ఇక కృష్ణ ఇలాంటి అవమానాలను చాలానే ఎదుర్కున్న తరువాత ఎలాగైనా ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగాలని మనసులో నిశ్చయించుకున్నారు. అగ్ర నటుడిగా కొనసాగడమే కాదు.. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని భావించారట.
Advertisement
ఈ నేపథ్యంలోనే తన సొంత తమ్మునిచేత పద్మాలయ స్టూడియో అనే ఒక నిర్మాత సంస్థ ప్రారంభించారు. ఇక ఏకంగా బడి పంతులు అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైన తరువాత బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకోవడంతో కృష్ణ తిరిగి ఇండస్ట్రీలో వెను తిరిగి చూసుకోలేదు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూనే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ప్రస్తుతం ఈయన వయస్సు పై పబడడంతో పూర్తి సినీ ఇండస్ట్రీకి విరామం ప్రకటించి విశ్రాంతి తీసుకుంటున్నారు సూపర్ స్టార్ కృష్ణ.
Also Read :
తండ్రి కోసం కుటుంబాన్నే ఎదిరించిన ఉమామహేశ్వరి..? ఎవరు చెప్పినా వినకుండా..!
సీఎం గా రాబోతున్న రామ్ చరణ్ సినిమా..?