Home » ప్రభాస్ తో ఉద్దేశపూర్వకంగానే కళ్యాణ్ రామ్ వైరం పెట్టుకున్నాడా ?

ప్రభాస్ తో ఉద్దేశపూర్వకంగానే కళ్యాణ్ రామ్ వైరం పెట్టుకున్నాడా ?

by Anji

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన సలార్ మూవీ కోసం ఇప్పుడు ఇండియా మొత్తం మూవీ లవర్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విషయం దాదాపు అందరికీ తెలిసిందే. అయితే  కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్-ప్రభాస్ వంటి సూపర్ స్టార్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ చిత్రం పై ప్రారంభ రోజు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలు రోజు రోజుకి పెరిగిపోవడమే తప్ప తగ్గడం లేదు.సెప్టెంబర్ 28 వ తేదీన రావాల్సిన ఈ సినిమా డిసెంబర్ 22కి వాయిదా పడింది.

ఈ వాయిదా ప్రభావం సినిమా మీద ఏమైనా పడుతుందా అని అనుకున్నారు. కానీ ఇసుమంత ప్రభావం కూడా పడలేదు, ఓవర్సీస్ బుకింగ్స్ అప్పుడే మూడు లక్షల డాలర్లకు రీచ్ అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ సునామి ని పసిగట్టి ముందు కానీ , వెనుక కానీ తమ సినిమాలను విడుదల చేసుకునే సాహసం చెయ్యట్లేదు మేకర్స్. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ వంటి స్టార్ హీరో కూడా ఈ సినిమా తో క్లాష్ ఎందుకు అని ఒక రోజు ముందుకు జరిగాడు.అలాంటి వాతావరణం ఉన్న ఈ నేపథ్యం లో సలార్ కి ఛాలెంజ్ విసురుతూ కళ్యాణ్ రామ్ తన డెవిల్  చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సిద్దం అయ్యారు.ఈ విషయాన్నీ కళ్యాణ్ రామ్ స్వయంగా తెలిపాడు. డిసెంబర్ 29 తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని విడుదల చేయబోతున్నట్టు ఆయన చేసిన కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి కోపం రప్పించింది.

సలార్ ఫీవర్ కి పెద్ద సూపర్ స్టార్స్ కూడా భయపడి వెనక్కి వెళ్తుంటే.. అలాంటి సందర్భంలో నువ్వు వస్తావా..? మా థియేటర్స్ ని తగ్గించడానికి కాకపోతే.. ఇలాంటి వాతావరణంలో వచ్చి బ్రేక్ ఈవెన్ కొట్టగలవా అని ప్రభాస్ ఫ్యాన్స్ కళ్యాణ్ రామ్ ని నిలదీస్తున్నారు. సంక్రాంతికి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తప్పుకుంది. ఆ స్లాట్ లో మీ సినిమాని విడుదల చేసుకోవచ్చు కదా.. ఎందుకు మాకు అడ్డు వస్తున్నారు అంటూ.. ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కల్యాణ్ రామ్ ని ప్రశ్నిస్తున్నారు. కావాలనే ఉద్దేశపూర్వకంగానే మనసులో ఏదో పెట్టుకొని ఈ మూవీని విడుదల చేస్తున్నారని.. ఇది మా మనస్సులో పెట్టుకుంటాం అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా.. అభిషేక్ నామ దర్శకత్వం వహించాడు. 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading