టీమిండియా మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ధోని సరికొత్త లుక్ లో అదుర్స్ అనిపిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ధోని బయట పెద్దగా కనబడడం లేదు. ఐపీఎల్ జరుగుతున్నప్పుడు మాత్రమే దర్శనమిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోని కేవలం ఐపీఎల్ మ్యాచ్ లను మాత్రమే ఆడుతున్నాడు. మరో రెండు నెలల్లో ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధోని మళ్లీ బ్యాట్ పట్టాడు.
Advertisement
తన ప్రాక్టీస్ ను ప్రారంభించాడు. ఇటీవలే ధోని ప్రాక్టీస్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా తన ప్రాక్టీస్ ముగించుకొని బయటకు వస్తున్న ధోని తెల్ల గడ్డం, నల్ల జుట్టుతో సాల్ట్ అండ్ పేపర్ లుక్ లో అభిమానుల కంటపడ్డాడు. ధోని కనిపించిన ఈ సరికొత్త లుక్ అందరినీ ఆకర్షించింది. వాస్తవానికి ఒక రోజు ముందు కూడా ధోని ఫోటోలను కొందరు అభిమానులు తీశారు. కానీ దూరం నుంచి కావడంతో అతన్ని స్పష్టంగా గుర్తించలేకపోయారు. ఇక ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని మరోసారి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఇలాంటి ప్రచారం జరిగింది. అయితే ఈసారి మాత్రం ధోనికి చివరి ఐపీఎల్ కానున్నదని చాలామంది అభిమానులు జోస్యం చెబుతున్నారు.
Advertisement
ఎందుకంటే ధోని ప్రస్తుత వయసు 41 ఏళ్లు. 42 ఏళ్ల వయసులోనూ అతడు క్రికెట్ ఆడేది అనుమానమే అని వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా గత ఏడాది ఐపీఎల్ కేవలం మహారాష్ట్ర, గుజరాత్, కోల్ కతాలకు మాత్రమే పరిమితమంది. అయితే ఈ ఏడాది మాత్రం ఎప్పటిలానే దేశం మొత్తం ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. దీంతో ధోని సొంత టీమ్ ప్రేక్షకుల మధ్య ఐపీఎల్ కు గుడ్ బై చెప్పే అవకాశముంది. ధోని సారథ్యంలో చైన్నై సూపర్ కింగ్స్ కు ఇప్పటివరకు నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇక గతేడాది రవీంద్ర జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పటికి అతను మధ్యలోనే వైదొలగడంతో తిరిగి ధోనినే జట్టును నడిపించాడు. గత సీజన్ లో సీఎస్కే 14 మ్యాచ్ లు ఆడి కేవలం నాలుగింటిలో మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచింది. మరి ఈ సీజన్ లో చెన్నై మనుపలి ఫామ్ ని కొనసాగిస్తుందో లేదో అనేది వేచి చూడాలి.
Also Read : Shubman Gill : శుభ్‌మన్ గిల్ సృష్టించిన సరికొత్త రికార్డులివే