Home » ‘ఢీ’ సినిమాకు ముందు అనుకున్నది విష్ణుని కాదా? ఆ సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

‘ఢీ’ సినిమాకు ముందు అనుకున్నది విష్ణుని కాదా? ఆ సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

ఒకప్పుడు వరుస హిట్లతో టాప్ డైరెక్టర్ గా పేరు పొందిన శ్రీనువైట్ల మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నీకోసం అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఇది కమర్షియల్ హిట్ అయ్యింది. ఆ తరువాత వచ్చిన ఆనందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. “వెంకీ, దుబాయ్ శీను, రెడీ,ఢీ, అందరివాడు, బాద్ షా,దూకుడు, సొంతం,ఆగడు..” సినిమాలతో దూసుకెళ్లిపోయారు.

Advertisement

ఇండస్ట్రీ లో ఓ టాప్ డైరెక్టర్ గా పేరు పొందారు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన “ఢీ” సినిమా సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీ కూడా చాలా బాగుంటుంది. ఢీ సినిమాలో మంచు విష్ణు, జెనీలియా జంటగా నటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా కోసం ముందుగా మంచు విష్ణు ని హీరో గా అనుకోలేదట. మొదట ఈ ఛాన్స్ రవితేజకు ఇవ్వాలని అనుకున్నారట.

Advertisement

అయితే..ఆ ఛాన్స్ రవితేజ కు వెళ్లకుండా.. మంచు విష్ణుకు వచ్చేలా మోహన్ బాబు తీసుకున్నారని అప్పట్లోనే మాటలు వినిపించాయి. ఓ సారి మోహన్ బాబు శ్రీనువైట్లతో మాట్లాడినపుడు మంచు విష్ణు ని హీరోగా పెట్టి ఓ సినిమా చేయమని అడిగారట. ప్రస్తుతం రవితేజ తో సినిమా తీస్తున్నానని.. అది అయ్యాక చేస్తానని చెప్పారట. ఆ సినిమా స్టోరీ చెప్పాలని కోరడంతో.. శ్రీనువైట్ల ఆ స్టోరీ ని మోహన్ బాబుకు వివరించారట. అయితే.. ఆ స్టోరీ బాగా నచ్చడంతో ఆ కథను మంచు విష్ణుతో తీయాలని మోహన్ బాబు కోరారట. దీనితో అప్పటికే ఈ కథ గురించి రవితేజకు చెప్పేసి ఉండడంతో శ్రీనువైట్ల మొహమాట పడ్డారట. రవితేజతో నేను మాట్లాడతాను అని చెప్పి మోహన్ బాబు రవితేజకు ఫోన్ చేసి మాట్లాడారట. రవితేజ కూడా సరే అని సైలెంట్ అవ్వడంతో ఈ కథ మంచు విష్ణుకు వెళ్ళింది.

మరిన్ని..

టాలీవుడ్‌ హీరోతో డేటింగ్‌లో సామజవరగమన హీరోయిన్‌ ?

బాయ్‌ ఫ్రెండ్‌ ను పరిచయం చేసిన సమంత..త్వరలోనే రెండో పెళ్లి ?

బాలకృష్ణ రవితేజ మధ్య గొడవేంటి..? బాలయ్య నిజంగానే కొట్టాడా..?

Visitors Are Also Reading