తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి తెలియని వారు లేరు. కోలీవుడ్ లో నెమ్మదిగా ఎదుగుతూ వచ్చిన ధనుష్ ఇప్పుడు ఓ స్టార్ హీరో అయ్యాడు. మన తెలుగులో కూడా రఘువరన్ బీటెక్ సినిమాతో మంచి గుర్తింపు తెచుకున్న ధనుష్.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అద్భుతమైన ఆఫర్లను అందుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో హీరో ధనుష్ మా కొడుకు అంటూ మధురైకి చెందిన కత్తిరెసన్, మీనాక్షి దంపతులు కోర్టును ఆశ్రయించడం అప్పట్లో పెద్ద చర్చగా మారిన విషయం తెలిసిందే.
Advertisement
మద్రాస్ హై కోర్టులో కత్తిరెసన్, మీనాక్షి దంపతులు.. ధనుష్ మాయా మూడో సంతానం. అతనికి నటన అంటే బాగా ఇష్టం. అందుకే చిన్నపుడు ఇంట్లో నుండి పారిపోయాడు. ఇప్పుడు మేము ముసలి వాళ్ళం అయ్యాం. అందుకే మేము బ్రతకడానికి అతను ప్రతి నెల మాకు 65 వేలు ఇవ్వాలి అంటూ కోర్టుకు తెలిపారు. దీనిని ధనుష్ కొట్టి పడేసాడు. దాంతో మద్రాస్ కోర్టు DNA పరీక్ష చేయాలనీ నిర్ధారించింది. కానీ దీనికి ధనుష్ మాత్రం ఒప్పుకోలేదు.
Advertisement
ఆ తర్వాత ఆ దంపతులు మరింత రెచ్చిపోయారు. కానీ ఆతర్వాత నేను తమిళ దర్శకుడు కస్తూరి రాజా, విజయ లక్ష్మిలా కొడుకుని అని.. తన జనన ధ్రువ పత్రాలను ధనుష్ కొరుకు అప్పగించాడు. దాంతో కోర్టు ఆ దంపతులు వేసిన పిటిషన్ ను కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు ధనుష్ ఆ దంపతులకు ఓ నోటిస్ పంపినట్లు తెలుస్తుంది. తాము డబ్బు కోసమే ఈ నాటకం ఆడం అంటూ మీడియా ముందు నిజం ఒప్పుకోవాలని.. లేదంటే నష్ట పరిహారంగా 10 కోట్లు కట్టాల్సి ఉంటుంది అన్ని అందులో తెలిపాడట. చూడాలి మరి దీని పైన ఆ దంపతులు ఎలా స్పందిస్తారు అనేది.
ఇవి కూడా చదవండి :
ఆర్ఆర్ ఫ్లైట్ లో పొగమంచు.. ల్యాండ్ చేయాలంటూ ఆటగాళ్ల కేకలు..!
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు వానగండం గుజరాత్ కు కలిసి వస్తుందా..?