Home » ఆ పాట నాగార్జున కోసం చేసింది కాదు… కానీ… నిజాలన్ని చెప్పేసిన దేవిశ్రీప్రసాద్..!

ఆ పాట నాగార్జున కోసం చేసింది కాదు… కానీ… నిజాలన్ని చెప్పేసిన దేవిశ్రీప్రసాద్..!

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన దేవి మూవీతో సంగీత దర్శకుడుగా కెరీర్ను మొదలుపెట్టాడు. ఆ తరువాత ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించి తన సంగీతంతో ఎన్నో మూవీల విజయంలో కీలకపాత్రను పోషించాడు. ఈ సంగీత దర్శకుడు కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే కాకుండా ఎన్నో ఇతర భాష సినిమాలకు కూడా సంగీతాన్ని అందించి ఇతర భాష సంగీత ప్రేమికులను కూడా ఎంతగానో అలరించాడు.

Advertisement

ఇది ఇలా ఉంటే కొంతకాలం క్రితం దేవి శ్రీ ప్రసాద్ “పుష్ప పార్ట్ 1” మూవీకి సంగీతం అందించాడు. పాన్ ఇండియా మూవీగా విడుదల అయిన ఈ సినిమా పాటలు ప్రపంచంలోని ఎంతోమంది సంగీత ప్రేమికులను అలరించాయి. ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడు చేతిలో అనేక మూవీలు ఉన్నాయి. అందులో పుష్ప పార్ట్ 2 మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు మూవీలతో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న కంగువా మూవీకి ఈ సంగీత దర్శకుడు సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

ఇది ఇలా ఉంటే తాజాగా ఆహా “ఓటిటి” లో టెలికాస్ట్ అయుతున్న ఇండియన్ ఐడల్ సీజన్ 2 కు ఈ వారం స్పెషల్ గెస్ట్ గా దేవి శ్రీ ప్రసాద్ వచ్చాడు. అందులో భాగంగా ఈ వారం ఈ షోలో అన్నీ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలను పాడగా ఒక కంటెస్టెంట్ నాగార్జున హీరోగా రూపొందిన మన్మధుడు మూవీలోని “నేను నేనుగా లేనే” అనే సాంగ్ ను పాడాడు. ఆ కంటెస్టెంట్ ఈ సాంగ్ ను అద్భుతంగా పాడడంతో జడ్జెస్ అందరూ ఆ కంటెస్టెంట్ ను ప్రశంసించగా.. దేవిశ్రీప్రసాద్ ఆ పాట గురించి ఒక సీక్రెట్ ను బయట పెట్టాడు.

devisriprasad

ఈ సాంగ్ మ్యూజిక్ ను తన ఫస్ట్ మూవీ కోసం కంపోజ్ చేశాన‌ని… కాకపోతే ఆ మూవీలో ఈ ట్యాన్‌ ఏ పాటకు సెట్ కాలేదు అని … దానితో దానిని అలా దాచి ఉంచాన‌ని తర్వాత వచ్చిన మన్మధుడు సినిమాలో ఈ సాంగ్ కి తగ్గట్టు సన్నివేశం వచ్చింది. అప్పుడు ఈ ట్యూన్ ను మన్మధుడు మూవీ డైరెక్టర్ అయిన విజయభాస్కర్ కు వినిపించగా ఈ పాటకు ఆ మ్యూజిక్ చాలా బాగా సెట్ అవుతుందని అయిన చెప్పగా … ఆ సాంగ్ను మన్మధుడు సినిమాలో పెట్టాం అని దేవి శ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

Visitors Are Also Reading