తెలంగాణలో ఎన్నో పురాతనమైన కట్టడాలు ఉన్నాయి. అందులో కొన్ని వందల ఏళ్లక్రితం నిర్మించినవి. అలాంటి పురాతనమైక కట్టడాల్లో ఒకటి దేవరకొండ కోట ఒకటి. ఈ కోటను 1279 నుంచి 1482 మధ్యకాలంలో నిర్మించారు. పద్మనాయక వెలుమ రాజులు నిర్మించారు. సింగమ భూపాల నాయక అనే రాజు కాలంలో ఈ కోట నిర్మాణం ప్రారంభం కాగ మాద రాజు కాలంలో పూర్తిచేసినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తరువాత కాలంలో ఈ కోటను అనేక మంది రాజులు స్వాధీనం చేసుకున్నారు. రాచరికాలు మారినా చరిత్రకు సాక్షీభూతంగా కోట ఇప్పటికీ అలానే ఉన్నది.
Advertisement
Advertisement
పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ఈ కోటను నిత్యం వందల మంది దర్శిస్తుంటారు. అయితే, ఈ కోటకు సంబంధించి వందేళ్ల క్రితం తీసిన ఫొటోలను హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రదర్శనకు ఉంచారు. సుమారు 600 ఫొటోలను ప్రదర్శిస్తున్నారు. క్రిష్టియన్ మిషనరీస్‌కు చెందిన కొందరు తీసిన ఫొటోలను డిసెంబర్ 11 నుంచి 18 రవీంద్రభారతిలో ప్రదర్శిస్తున్నారు.
ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ చారిత్రాత్మకమైన ప్రదర్శనను తప్పకుండా చూడాలని నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి 117 కిమీ దూరంలో ఈ దేవరకొండ కోట ఉన్నది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా దేవరకొండ కోటను చేరుకోవచ్చు.