సినిమా ఇండస్ట్రీ అంటేనే సముద్రపు అలా లాంటిది.. అలలు ఎప్పుడు కూడా నిలకడగా ఉండవు.. అలాగే ఇండస్ట్రీలో కూడా ఎవరు నిలకడగా ఉండలేరు.. ఈ సినిమా ప్రపంచంలో రాణించాలి అంటే నటనా టాలెంట్ తో పాటు కాస్త లక్కు కూడా కలిసి రావాలి. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చి బాగా ఎదిగిన వారు ఉన్నారు, ఇండస్ట్రీని నమ్ముకుని పూర్తిగా అప్పుల పాలైన వారు ఉన్నారు.. ఈ విధంగా ఇండస్ట్రీలో ఎలాగైనా నిలదొక్కుకోవాలని వచ్చారు రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల..
Advertisement
also read;రానాకి ఏమైంది.. సినిమాలకు దూరమవడం వెనక ఇంతటి విషాదం ఉందా..?
ఎంతో కష్టపడ్డారు కానీ ఆయనకు సక్సెస్ రాలేదు.. చివరికి నిరాశే ఎదురయింది.. దేవదాస్ కనకాల యానాం దగ్గరలో జన్మించారు.. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తిచేసి కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్లో మంచి నటుడుగా సేవలందించారు. అలాంటి దేవదాస్ గురించి సీనియర్ సినీ జర్నలిస్ట్ ఈ మంది రామారావు కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.. అవేంటయ్యా అంటే.. రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల ఓ సీత కథ మూవీలో అద్భుతంగా చేశారని ఆయనను గుర్తు చేసుకున్నారు.
Advertisement
కానీ ఇండస్ట్రీలో ఆయనను తొక్కేశారని అన్నారు.. అదృష్టం దేవదాసు గారికి కలిసి రాలేదని అందుకే సినిమా పరిశ్రమలో నిలబడలేకపోయారని తెలియజేశారు.. ఇక దేవదాస్ కనకాల చివరి చిత్రం భరత్ అనే నేను.. ఈ మూవీ తర్వాత ఆయన అనారోగ్యానికి గురై మరణించారు.. ఇక ఆయన కుమారుడు రాజీవ్ కనకాల ఇండస్ట్రీలో మంచి నటుడిగా కొనసాగుతున్నారు. ఆయన కోడలు సుమ కనకాల బుల్లితెర మీద టాప్ యాంకర్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా సినిమాల్లో కూడా చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ నటిగా ఎదుగుతోంది..
also read;Bigboss 6 Telugu: శ్రీహాన్ కి సిరి బ్రేకప్ చెప్పినట్టేనా.. కారణం ఏంటంటే..?