స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే వారి అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు మరీ. అలాంటి స్టార్ హీరోలు తమ వారసులతో కలిసి నటిస్తే.. ఇక వారికి తిరుగుండదు. వారి ఫ్యాన్స్‌కు చెప్పలేని ఆనందం. ఆయా సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయంటే.. వారి హడావిడి మామూలుగా ఉండదు మరీ. ప్రస్తుతం టాలీవుడ్ లో తండ్రి కొడుకులు కలిసి నటించిన పలు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ ఏ టాప్ హీరోలు తమ కొడుకులతో కలిసి నటించిన సినిమాలను షేర్ చేసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిరంజీవి చాలా రోజుల తరువాత నటించిన సినిమా ఖైదీ నెంబర్ 150. ఈసినిమాలో రామ్‌చరణ్ గెస్ట్ రోల్ గా వచ్చి చిరంజీవితో కలిసి ఢ్యాన్స్ చేశాడు.
Advertisement
Ad
Advertisement
ఇక తాజాగా వీరిద్దరూ కలిసి ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు కొరటాశివ తెరకెక్కించే ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. ఫిబ్రవరి 4న ఈ సినిమా విడుదల కానున్నది. అటు నాగార్జున సైతం తన కొడుకుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. బంగార్రాజు సినిమాలో నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ కలిసి నటించిన మనం మంచి విజయాన్ని అందించింది. తాజాగా ఈ సినిమాతో మంచి హిట్ కొడతారేమో చూడాలి మరీ.
రెబర్ స్టార్ కృష్ణంరాజు ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను ఏలిన నటుడు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ హీరోగా చేస్తున్న రాధేశ్యామ్ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన బిల్లా, రెబల్ సినిమాలు దుమ్ము రేపాయి. దీంతో వీరి తాజా మూవీపై ఓ రేంజ్‌లో అంచెనాలు ఉన్నాయి. రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 14న విడుదల కాబోతుంది. అటు అర్జున్‌రెడ్డి రీమెక్‌తో వెండితెరకు పరిచయమయ్యాడు విక్రమ్ కొడుకు ధృవ్. వీరిద్దరి కాంబినేషన్‌లో మహాన్ అనే సినిమా రెడీ అవుతుంది. కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా 2022లో విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్రణాళికలు వేస్తుంది.