మనదేశంలో కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంకు ఆప్ ఇండియా ముద్రిస్తున్న విషయం మనందరికీ తెలిసినదే. ముఖ్యంగా భద్రతా విషయాలను దృష్టిలో పెట్టుకుని నోటుపై చిన్న చిన్న గుర్తులను వేస్తుంది. ఈ ప్రక్రియ ఫేక్ కరెన్సీకి అడ్డుకట్ట వేయడానికి ఉపయోగపడుతుందని వారు పేర్కొంటున్నారు. మీరు ఎప్పుడైనా రూన100, 200, రూ.500, రూ.2000 నోట్లపై నల్లని గీతలు మీరు ఎప్పుడైనా చూసారా.. అవి ఎందుకో వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? ఆ లైన్‌ల గురించి అర్థం తెలుసుకోండి.
Advertisement
నోట్లపై ఉండే ఈ గీతలను బ్లీడ్ మార్క్స్ అని పిలుస్తుంటారు. ఈ బ్లీడ్ మార్క్స్ ప్రత్యేకంగా అంధుల కోసం తయారు చేస్తారు. ఈలైన్ టచ్ చేయడం ద్వారా అది ఎంత కరెన్సీ నోటు అనేది వారికి అర్థమవుతుంది. అందుకే రూ.100, రూ.200, రూ.500, రూ.2000 నోట్లపై వేరువేరు రూపాలలో ఈ లైన్లు ఉంటాయి. వాటి విలువలను సూచిస్తాయి.
Advertisement
ఈ రూ.100 నోటుపై రెండు వైపులా నాలుగు లైన్లు ఉంటాయి. అదేవిధంగా 200 నోటుపై కూడా ఇరువైపులా నాలుగు లైన్లు.. రెండు సున్నాలుంటాయి. అదే సమయంలో రూ.500 నోట్లపై 5 గీతలు, 2వేల నోటుపై రెండు వైపులా 7 గీతలుంటాయి. ఈ గీతల సహాయంతో అంధులకు ఆ కరెన్సీ నోటు విలువ ఎంతో అర్థమవుతుంది. మరోవైపు 2వేల నోటు వెనుకభాగంలో మంగళయాన్ ఫోటో ముద్రించబడి ఉంటుంది. రూ.500 నోటుపై ఎర్రకోట చిత్రాన్ని ముద్రించారు. అదేవిధంగా రూ.200 నోటు వెనుక భాగంలో సాంచి స్థూపముంటుంది. ఇక రూ.100 నోటుపై రాణికి వావ్ చిత్రముంటుంది. దీనిని యూనెస్కో 2014లో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చినది.