Ad
ఐపీఎల్ 2022 టైటిల్ కోసం మొత్తం 10 జట్లు పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాది వరకు 14 జట్లతోనే జరిగిన ఈ లీగ్ లోకి ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెంట్స్ పేరిట రెండు కొత్త జట్లు వచ్చాయి. దాంతో ఈ ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు మెగా వేలం నిర్వహించింది బీసీసీఐ. ఇందులో రిటెన్షన్ ప్రక్రియ కింద కేవలం నాలుగు ఆటగాళ్లనే తమతో ఉంచుకోవాలి అని.. మిగిలిన వారందరని వేలానికి విడిచి పెట్టాలని చెప్పడంతో ఐపీఎల్ 2021 లో అదరగొట్టిన చాల మంది ఆటగాళ్లు వేలంలోకి వచ్చి వేరే జట్లకు వెళ్లారు. అందువల్లనే అభిమానులు కూడా చాలా తికమకపడ్డారు.
అయితే గత ఏడాది ఓ జట్టుకు ఆడి ఈ ఏడాది మరో జట్టుకు ఆడుతున్న ఆటగాళ్లలో చేతన్ సకారియ కూడా ఒక్కడు. ఐపీఎల్ 2021 లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడిన సకారియను ఈ మెగా వేలంలో ఢీల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం 4.20 కోట్లు ఖర్చు చేసి తమ జట్టులోకి తీసుకుంది. కానీ అనుకున్నని అవకాశాలు మాత్రం ఇవ్వలేదు. కేవలం మూడు మ్యాచ్ లలో మాత్రమే ఆడించి… ఎక్కువగా నెచ్ కు మాత్రమే పరిమితం చేసింది. అయితే ఈ ఐపీఎల్ లోకి తమ చివరి మ్యాచ్ లో ముంబై చేతిలో ఓడిపోయిన ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్స్ కు రాలేదు.
కానీ రాజస్థాన్ మాత్రం లీగ్ దశలో మంచి ఆటతీరును కనబర్చి ప్లే ఆఫ్స్ కు మాత్రమే కాకుండా ఫైనల్స్ కు చేరింది. దాంతో ఇప్పుడు ఆడేది ఢిల్లీకీ అయిన తనకు ఐపీఎల్లో అవకాశం ఇచ్చి.. జీవితాన్ని మార్చేసిన రాజస్థాన్ ను మాత్రం సకారియా మర్చిపోలేకపోయాడు. ఎందుకే ఫైనల్స్ లో గుజరాత్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ కు మద్దతుగా పింక్ జెర్సీ వేసుకొని కనిపించాడు. అలాగే జట్టు వరుస వికెట్లు కోల్పోతుండటంతో చాలా నిరాశకు గురైనట్లుగా కూడా సకారియా మొఖం చూస్తేనే అర్ధం అవుతుంది.
ఇవి కూడా చదవండి :
ఐపీఎల్ 2023 దద్ధరిల్లిపోతుంది అంటున్న రోహిత్ శర్మ..!
కోహ్లీకి ఇదే మంచి సమయం.. ఆ పని చేయడానికి..!
Advertisement