Home » ఢిల్లీ స‌ర్కార్ కీల‌క ఆదేశాలు..న‌వంబ‌ర్ 27 నుండి డిసెంబ‌ర్ 3వ‌ర‌కూ ఆ వాహ‌నాలు రొడ్డెక్కకూడ‌దు..!

ఢిల్లీ స‌ర్కార్ కీల‌క ఆదేశాలు..న‌వంబ‌ర్ 27 నుండి డిసెంబ‌ర్ 3వ‌ర‌కూ ఆ వాహ‌నాలు రొడ్డెక్కకూడ‌దు..!

by AJAY
Ad

కాలుష్యంతో పోరాడుతున్న ఢిల్లీపై దీపావ‌ళి పండ‌గ ప్ర‌భావం మరింత ఎక్కువ‌గా పడింది. కాలుష్యం స్థాయిలు భారీగా పెర‌గ‌టంతో ప్ర‌జ‌లు అనారోగ్య కార‌ణాల‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. ఇక కాలుష్యం ప్ర‌భావం పెర‌గటంతో ప్ర‌భుత్వం కూడా ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా ఇటీవ‌ల ఢిల్లీ కాలుష్యం పై సుప్రీం కోర్టు సైతం విసుర్లు కురింపించింది. అయితే తాజాగా కాలుష్యం ఎఫెక్ట్ ను త‌గ్గించేందుకు ఢిల్లీ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. న‌వంబ‌ర్ 27 నుండి డిసెంబ‌ర్ 3వ‌ర‌కూ న‌గ‌రంలో పెట్రోల్ మరియు డీజిల్ వాహ‌నాల‌ను న‌డ‌ప‌టాన్ని నిషేదించింది.

Advertisement

Advertisement

కేవలం సీఎన్జీ గ్యాస్ మ‌రియు ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు న‌డిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది. ఈ విష‌యాన్ని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ వెల్ల‌డించారు. అయితే నిత్యావ‌ర‌స‌ర సేవ‌లో ఉప‌యోగించి మెడిక‌ల్ ఇత‌ర వాహ‌నాల‌కు మాత్రం అనుమ‌తులు ఇస్తున్న‌ట్టు మంత్రి ప్ర‌క‌టించారు. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరిక‌ట్ట‌డానికే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

అయితే ఈ ఆంక్ష‌లు వాణిజ్య వాహ‌నాల‌పై విధిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. కానీ ప్ర‌యివేటు వాహ‌నాల‌పై కూడా ఆంక్షలు విధిస్తారా లేదా అన్న‌ది చూడాలి. ఇదిలా ఉండ‌గా ఢిల్లీలో కాలుష్యాన్ని అరిక‌ట్ట‌డానికి ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కాలుష్యాన్ని క‌ట్ట‌డి చేసేందుకే ప‌ది హేనేళ్ల‌కంటే పాత‌వి అయిన పెట్రోల్ వాహ‌నాల‌ను మ‌రియు ప‌దేళ్ల‌కంటే పాత‌వి అయిన డీజిల్ వాహ‌నాల‌ను బ్యాన్ చేశారు. ఈ చ‌ర్య‌ల‌తో ప్ర‌జ‌లు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌నే కొనాల‌ని ప్ర‌భుత్వం ఒత్తిడి తెస్తోంది.

Visitors Are Also Reading