హైదరాబాద్ లో ల్యాబ్స్ పేరుతో మత్తుపదార్థాలను తయారు చేస్తున్నట్టు అధికారులకు సమాచారం అందింది. దాంతో ఈనెల 21 నుండి ఆపరేషన్ మొదలుపెట్టిన అధికారులు.. పలు పార్టీల నుండి ఆర్డర్లు తీసుకున్న.. నిన్న రూ.50 కోట్ల మత్తుపదార్థాలను అధికారులు సీజ్ చేశారు. దాంతో తయారీదారులు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ నుంచి సేకరించిన సమాచారంతో మళ్లీ రోహిత్‌రెడ్డిని ఈడీ ప్రశ్నించనుంది. హైకోర్టులో రిట్ పిటిషన్‌పై విచారణ జరిగేవరకు హాజరు కానని రోహిత్ రెడ్డి చెబతున్నట్టు సమాచారం. హైకోర్టు నుండి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో రోహిత్‌రెడ్డి విచారణకు ఈడీ సిద్దం అవుతోంది.
Advertisement
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు కాస్త పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,950 గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,480 లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 74,000 లకు చేరింది.
Advertisement
కరోనా నేపథ్యంలో సంక్రాంతికి జరిపే జల్లికట్టు పోటీలను పోలీసులు నిషేదించారు. కరోనా కారణంగా జల్లికట్టుకు అనుమతి నిరాకరించారు. జల్లికట్టు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటల సమయం పుడుతోంది.
ఏపీ సీఎం జగన్ కరోనా పై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మాస్క్ ధరించడంతో పాటు కోవిడ్ నివారణ చర్యలపై అవగాహన కలిగించాలని సూచించారు. అనుమానాస్పదంగా ఉన్న కేసుల్లో తప్పనిసరిగా పరీక్ష నిర్వహించాలని చెప్పారు. ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలపై మరోసారి విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నిన్న రాజ్ భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ విందుకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండటంతో బీజేపీ నాయకులు విర్శకులు కురిపిస్తున్నారు.
నేను బాలయ్య పవన్ కల్యాణ్ తో అన్ స్టాపబుల్ షో షూటింగ్ జరనుంది. ఈ షోలో సాయిధరమ్ తేజ్ కూడా సందడి చేయనున్నారు.