Home » జిమ్‌లో రౌడీలను చితకబాదిన డేవిడ్ వార్నర్.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

జిమ్‌లో రౌడీలను చితకబాదిన డేవిడ్ వార్నర్.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

డేవిడ్ వార్నర్ జిమ్ లో దాదాపు డజన్ మంది రౌడీలను చితకబాదాడు.వారితో ఫైట్ చేస్తున్నటువంటి వీడియోని సోషల్ మీడియాలోషేర్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతని అభిమానులు ఈ వీడియోను చూసి నోరెళ్లబెడుతున్నారు. ఫన్నీ కామెంట్లతో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఆ తరువాత ఈ ఫైట్ వీడియో అసలు కథ బయటికి వచ్చింది వాస్తవానికి ఈ వీడియో సౌత్ ఇండియా స్టార్ హీరో విక్రమ్ నటించిన ఓ సూపర్ హిట్ సినిమాలోని ఓ సన్నివేశం. అయితే ఇందులో విక్రమ్ ఫేస్ కి బదులు వార్నర్ తన ఫేస్ ని ఉంచాడు. 

Advertisement

ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తూ.. ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ నాకు ఇష్టమైన సినిమాలలో ఇది ఒకటి అంటూ.. ఆ సినిమా పేరుని చెప్పాలంటూ అభిమానులను ప్రశ్నించాడు. భారత్ తో వార్నర్ కి ప్రత్యేక అనుబంధం ఉంది. తరచుగా భారతీయ సినిమాల గురించి తన కుటుంబంతో కలిసి రీల్స్ తయారు చేస్తుంటాడు. గతంలో కూడా షారూఖ్ ఖాన్, అల్లు అర్జున్ సినిమాలలోని కొన్ని ప్రత్యేక సన్నివేశాలపై రీల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల డేవిడ్ వార్నర్ తన ఇంటికి తిరిగి వచ్చాడు. 4 టెస్టుల సిరీస్ కోసం భారత్ కి వచ్చాడు. రెండు టెస్టుల్లోనే ఫ్లాప్ అయ్యాడు. అతని బ్యాట్ నుంచి పరుగుల వర్షం రాలేదు. 

Also Read :  తాలిబొట్టు కూడా కొన‌లేని స్థితిలో పూరీజ‌గ‌న్నాథ్…అలాంటి స్థితిలో పెళ్లి చేసిన న‌టి, యాంక‌ర్ ఎవ‌రంటే..?

వార్నర్ తొలిటెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లో కలిపి 11 పరుగులు, రెండో టెస్టులో 15 పరుగులు చేసాడు. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్ లో మోచేయికి గాయం కావడంతో సిరీస్ మధ్యలో ఆస్ట్రేలియా తిరిగి వెళ్లాల్సి వచ్చింది. వార్నర్ వీలైనంత త్వరగా ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్  మ్యాచ్ లు మార్చి 31, 2023 నుంచి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ లేకపోవడంతో వార్నర్ కెప్టెన్ వ్యవహరించనున్నాడు. కొంతకాలంగా రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై కొద్ది రోజుల కిందట ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు.  అతను పూర్తిగా ఫిట్ గా మారడానికి చాలా సమయం పట్టే అవకాశముంది. 

Also Read :   Taraka Ratna Restaurant: తారకరత్న హోటల్‌ను కూల్చివేశారా? అసలు ఏం జరిగింది?

Visitors Are Also Reading