నటీనటులు : నాని, కీర్తి సురేష్, సాయికుమార్, షైన్ టౌన్ చాకో, పూర్ణ, దీక్షిత్, సముద్ర కని
డైరెక్టర్: శ్రీకాంత్ ఓదెల
Advertisement
నిర్మాత: చెరుకూరి సుధాకర్
సంగీతం: సంతోష్ నారాయణన్
also read:అల్లు ఫ్యామిలీతో గొడవలు…ఒక్క ఫోటోతో ఫుల్ క్లారిటీ ఇచ్చిన చిరంజీవి..!
కథ:
వీర్నపల్లి అనే చిన్న పల్లెటూరు నేపథ్యంలో సాగే దసరా మూవీ లో చిన్నప్పటి స్నేహితులైన ధరణి (నాని ), వెన్నెల (కీర్తి సురేష్,) సూరి దీక్షిత్ శెట్టి పై ఆధారపడి నడుస్తుంది. ధరణి వెన్నెలను ప్రేమిస్తాడు. కానీ ఆమె మనసులో సూరి ఉంటాడు. ఇంతలో వీరినపల్లిలో ప్రజల జీవితాలు, సిల్క్ స్మిత బార్, బొగ్గు మైనింగ్ చుట్టూ తిరుగుతుంది. అక్కడ ఉండే స్థానిక రాజకీయాలు, ధరణి,సూరి,వెన్నెల ప్రేమ వ్యవహారం చుట్టూ సాగే ఈ కథనే దసరా.
ఎలా ఉందంటే:
శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ దసరా నాని తన నటనతో అదరగొట్టాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎక్కువ నాని పై బేస్ అయ్యే సినిమా నడుస్తుంది. ఇది నాని కెరియర్ లో ఉత్తమ చిత్రంగా నిల్వవచ్చు. నాని భాష, యాస, రూపురేఖలతో మంచి ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెల్స్ అన్ని కలగలిపి సాధారణ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యేలా తన నటనతో అధరకొట్టారని చెప్పవచ్చు. ఇక నానితో పాటుగా కీర్తి సురేష్ నటన మరో లెవెల్. ఇక దీక్షిత్ శెట్టి నానితో సమానంగా ఎక్కడ తగ్గకుండా నటించారు. ఈ విధంగా ఈ ముగ్గురి నటన దసరా సినిమాను తారాస్థాయికి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. సముద్రఖని, సాయికుమార్ వారి వారి పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు.
Advertisement
also read:ఆర్ఆర్ఆర్ తమిళ సినిమా అంటూ ప్రియాంక చోప్రా కామెంట్స్…నెట్టింట దారుణమైన ట్రోల్స్..!
సాంకేతిక విభాగం :
ఇప్పటివరకు పల్లెటూరి నేపథ్యంతో వచ్చిన అనేక సినిమాలు చూసాం. ఇందులో దసరా కూడా ఒకటి కానీ సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ అత్యున్నతంగా తీర్చిదిద్దారు. క్వారీల చుట్టూ ఉన్న రోడ్లు , మనకు చూసే ఫ్రేముల నుండి సూర్యాస్తమయం షాట్స్ వరకు ఇన్ ల్యాండ్ అనుభూతిని కలిగిస్తుంది. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం. సినిమా లేవేల్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది . ఇక చంకీలా అంగీలు వేసి పాట చిత్రానికే వన్నెతెచ్చింది. మొదటి భాగం కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది కానీ నాని తన నటన స్టైల్ తో నడిపించారు. కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి .
also read:అమితాబ్ మనవడితో షారుఖ్ కూతురు డేటింగ్..నైట్ పార్టీలో ఆ పనులు ?
ప్లస్ పాయింట్స్:
నాని నటన
యాక్షన్ సీన్స్
సినిమాటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
సూటిగా సాగే కథ
కొన్ని విభాగాల్లో స్లో అవ్వడం
విలనిజం
రేటింగ్:3/5