ధర్మవరపు సుబ్రమణ్యం ఈ పేరు చెబితే గుర్తుపట్టని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో ధర్మవరపు సుబ్రమణ్యం కమెడియన్ నటించి నవ్వులు పూయించారు. ముఖ్యంగా కాలేజీ లెక్చరర్ పాత్ర చేయాలంటే ఆయన తరవాతనే ఎవరైనా. దాదాపు వందకు పైగా సినిమాలలో ఆయన కమెడియన్ గా నటించారు. నువ్వునేను, సొంతం, యజ్ఞం, ఒక్కడు సినిమాలలో ఆయన చేసిన కామెడీని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.
Advertisement
కాబట్టి ప్రస్తుతం ఆయన మనమధ్యన లేకపోయినా ఆయన చేసిన సినిమాల ద్వారా ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నారు. ఇక సుబ్రమణ్యం 2013 సంవత్సరంలో కాలేయ సంబంధిత క్యాన్సర్ వ్యాధితో కన్నుమూశారు. కాగా తాజాగా ఆయన కుమారుడు బ్రహ్మతేజ ఓ ఇంటర్వ్యూలో ఆయన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి తమకు ఎలాంటి కష్టం రాకుండా పెంచారని చెప్పాడు.
Advertisement
తాము ఇప్పడు అనుభవిస్తున్నది అంతా తన తండ్రి కష్టమేనని అన్నాడు. 2001లో నువ్వునేను సినిమా సక్సెస్ పార్టీకి వెళ్లి వస్తుండగా ఆయనకు యాక్సిడెంట్ అయ్యిందని అప్పుడు తలకు 21 కుట్లు పడినా బ్రతికారని చెప్పారు. అంతే కాకుండా 2005 సంవత్సరంలో సిగరెట్ లు అధికంగా తాగడం వల్ల లంగ్స్ పాడయ్యాయని డాక్టర్ లు చెప్పారని అన్నారు. ఆ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని చెప్పాడు. కానీ అప్పుడు కూడా తన తండ్రిని కాపాడుకున్నామని చెప్పాడు.
అయితే 2012లో ఆయన ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించిందని చెప్పారు. ఆస్పత్రికి వెళ్లడంతో డాక్టర్ లు లివర్ క్యాన్సర్ నాలుగో స్టేజ్ లో ఉందని చెప్పారని అన్నాడు. తన తండ్రి అనారోగ్యం బారిన పడినప్పుడు బ్రహ్మానందం తరచూ కాల్ చేసేవారని అన్నాడు. నిన్ను చూడ్డానికి వస్తానని ఆయన అంటే నాన్న మాత్రం నన్ను చూస్తే తట్టుకోలేవని చెప్పి ఎనిమిది నెలల తరవాత కలిసి సినిమా షూటింగ్ చేద్దామని అన్నారు. కానీ డాక్టర్ లు చెప్పినట్టే తన తండ్రి 11 నెలలకే కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ALSO READ :పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ టెస్ట్.. అసలు కారణం తెలిస్తే నోరేళ్లబెడతారు..!!