Home » సంజూ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టగలడు..!

సంజూ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టగలడు..!

by Azhar
భారత యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు దేశ వ్యాప్తంగా కూడా మంచి ఫాలోయింగ్ అనేది ఉన్న విషయం తెలిసిందే. ఇక బీసీసీఐ సెలక్టర్లు సంజూ శాంసన్ లో ప్రతిభకు తగ్గిన విధంగా ఆవకాహలు ఇవ్వడం లేదు అని ప్రతి అభిమాని అనుకుంటున్నారు.అయితే ప్రస్తుతం సంజూ శాంసన్ సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో ఆడుతున్నాడు.
అయితే ఈ వన్డే సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్ లో సంజూ శాంసన్ చేసిన బ్యాటింగ్ ఎవరు మరిచిపోరు. చివరి ఓవర్లో 30 బంతులు కావాల్సి ఉండగా.. 20 పరుగులు చేసి సఫారీలకు టెన్షన్ పెట్టాడు. మ్యాచ్ అనంతరం మరో రెండు బంతులు ఆడి ఉంటె.. గెలిపించేవాడిని అని కూడా అన్నాడు. అయితే సంజూ శాంసన్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టే సత్తా ఉంది అని సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్ అన్నాడు.
తాజాగా డేల్ స్టెయిన్ మాట్లాడుతూ… సంజూ బ్యాటింగ్ నన్ను భయపెట్టింది. 39 వ ఓవర్లో సంజూకు బ్యాటింగ్ వస్తే మ్యాచ్ మరోలా ఉండేది. ఇక నేను సంజూకి బ్యాటింగ్ రాకూడదు అనుకున్నాను. అయితే అతను యువరాజ్ మాదిరి ఆరు బంతుల్లో అయారు సిక్సులు కొట్టే సామర్ధ్యం ఉన్న ఆటగాడు.. అతను ప్రతిభ నాకు తెలుసు అని ఈ సఫారీ మాజీ పేసర్ డేల్ స్టెయిన్ పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం ఈ కామెంట్స్ అనేవి వైరల్ అవుతున్నాయి.
Visitors Are Also Reading