దర్శకుడు తేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన కెరియర్ లో ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. ఈయన దర్శకుడుగా కెరియర్ను ప్రారంభించిన సమయంలో ఎంతో మంది కొత్త హీరోలతో… హీరోయిన్లతో… టెక్నీషియన్లతో చాలా తక్కువ బడ్జెట్లో సినిమాలను నిర్మించి చాలా ఎక్కువ మొత్తంలో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లను రాబట్టిన సినిమాలు అనేకం ఉన్నాయి.
Advertisement
అలా ఆ సమయంలో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టిన తేజ ఈ కాలంలో మాత్రం ఆ రేంజ్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేకపోతున్నాడు. వరస అపజాయలతో సతమతం అవుతున్న సమయంలోనే తేజ “నేనే రాజు నేనే మంత్రి” అనే మూవీకి దర్శకత్వం వహించి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీలో రానా హీరోగా నటించగా… కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది.
Advertisement
ఈ మూవీతో తిరిగి ఫామ్ లోకి వచ్చిన తేజ ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా “సీత” అనే మూవీని తెరకెక్కించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలిన ఈ సినిమాలో మొదటగా హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను కాకుండా మరో హీరోను తేజ అనుకున్నాడట. కాకపోతే ఆ హీరో కొన్ని కారణాల వల్ల ఈ మూవీని రిజెక్ట్ చేశాడట. ఆ హీరో ఎవరు… ఎందుకు ఈ సినిమాను రిజెక్ట్ చేశాడో తెలుసుకుందాం.
దర్శకుడు తేజ “సీత” మూవీ కథ మొత్తం పూర్తి అయిన తర్వాత ఈ మూవీ కథను దగ్గుపాటి రానాకు వినిపించాడట. కాకపోతే ఆ సమయంలో రానాకు కొన్ని హెల్త్ సమస్యలు ఉండడంతో ఇప్పుడు ఈ సినిమా చేయడం కుదరదు అని తేజకు చెప్పాడట. దానితో ఈ దర్శకుడు ఇదే కథను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు చెప్పి ఒప్పించి సీత అనే పేరుతో సినిమాను తలకెక్కించాడు. అలా రానా రిజెక్ట్ చేసిన స్టోరీని సాయి శ్రీనివాస్ తో తెరాకెక్కించిన తేజ ఈ మూవీతో ఘోర పరాజాయన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నాడు.