మెగా హీరో చిరంజీవి గురించి తెలియని వారు ఉండరు. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈయన నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు ఎంతోమంది ప్రేక్షకులను కూడా సంపాదించుకున్నాడు. అయితే 2001లో వచ్చిన డాడీ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో తండ్రి కూతుర్ల అనుబంధాన్ని చాలా చక్కగా చూపించారు.
Advertisement
ఈ సినిమా అప్పట్లో అంతగా ఆడకపోయినా… చాలామందికి ఫేవరెట్ సినిమాగా నిలిచిపోయింది. అయితే ఈ సినిమా స్టోరీని మొదటగా చిరంజీవికి భూపతి రాజు వివరించారట. దీంతో చిరంజీవి నేను ఈ స్టోరీకి నేను సెట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో నన్ను జైల్లో పెట్టడం, కూతురి చావుకి నేను కారణమవడం, ఎంతో ఇష్టంగా ప్రేమించిన భార్య దూరమవడం, ఫ్రెండ్స్ మోసం చేయడం ఇన్ని కష్టాలు నేను భరిస్తుంటే ఆడియన్స్ నన్ను చూడలేరు అని చిరంజీవి అన్నాడట.
Advertisement
దీంతో చోటా కె నాయుడు, సురేష్, భూపతి రాజు బలవంతంగా ఈ సినిమాకి చిరంజీవిని ఒప్పించారట. చిన్నపిల్లలతో మీ బాండింగ్ చాలా బాగుంటుంది. మీరు అయితే ఈ కథకు చాలా బాగా సెట్ అవుతారు అని ఒప్పించారట. అయితే ఈ స్టోరీ చెప్పగానే చిరంజీవి వెంటనే ఈ స్టోరీ నా కన్నా వెంకటేష్ కి అయితే బాగుంటుందని చెప్పారట. ఆయన అన్నట్టుగానే సినిమా రిలీజ్ అయ్యాక వెంకటేష్… చిరంజీవితో ఈ సినిమా చాలా బాగుంది. కానీ ఇందులో మీకన్నా నేను అయితే చాలా బాగా ఉండేదని అన్నారట. చిరంజీవి చెప్పిన దాని ప్రకారమే వెంకటేష్ కూడా అలానే అనున్నాడట.
ఇవి కూడా చదవండి
Money Plant : మనీ ప్లాంట్ ను ఇలా పెడితే… చాలు కనుక వర్షం కురుస్తుంది
మెకానిక్ తో కీర్తి సురేష్ రొమాన్స్.. మండిపడుతున్న అభిమానులు
Upasana : మెగా కోడలు ఉపాసన ఆస్తుల విలువ ఎంతో తెలుసా…?