Home » అమ్మాయిది ఫ్రాన్స్, అబ్బాయిది ఇండియా…వీళ్ల ల‌వ్ స్టోరీలో బోలెడ‌న్ని ట్విస్టులు!!

అమ్మాయిది ఫ్రాన్స్, అబ్బాయిది ఇండియా…వీళ్ల ల‌వ్ స్టోరీలో బోలెడ‌న్ని ట్విస్టులు!!

by Azhar

ప్రేమకు కుల‌మ‌తాల హ‌ద్దులే కాదు దేశాల‌ సరిహద్దులు కూడా ఉండ‌వ‌ని నిరూపించింది ఈ జంట‌! త‌న ఇష్ట‌ప‌డిన వ్య‌క్తిని పెళ్లి చేసుకోవ‌డం కోసం ఫ్రెంచ్ అమ్మాయి స‌రాస‌రి ఇండియా వ‌చ్చి ఇక్క‌డి సాంప్ర‌దాయంలో వివాహం చేసుకుంది.

ఆ ల‌వ్ స్టోరీ వివ‌రాల్లోకెళ్తే……
పారిస్‌లో వ్యాపారవేత్త అయిన మేరీ లోరీ హెరాల్ అనే ఫ్రెంచ్ మహిళ ఆరేళ్ల క్రితం టూర్ నిమిత్తం ఇండియాకు వ‌చ్చింది ఈ క్ర‌మంలో ఆమెకు టూర్ గైడ్ గా వ్య‌వ‌హ‌రించిన బీహార్ లోని జెగుస‌రాయ్ నివాసీ అయిన రాకేష్ తో ప్రేమ‌లో ప‌డింది. త‌న టూర్ ముగించుకొని ఫ్రాన్స్ వెళ్లాక లోరీ రాకేష్ తో ఫోన్ లో ట‌చ్ లో ఉండేది. ఆ ప‌రిచ‌య‌మే త‌ర్వాత ప్రేమ‌గా మారింది.

రాకేష్ పై ప్రేమ‌తో లోరీ రాకేష్ ను ఫ్రాన్స్ కు ఆహ్వానించింది. అక్క‌డే ఒక వ్యాపారం చేసేలా ప్రోత్సాహించింది. ఆ బిజినెస్ కూడా సక్సెస్ అవ్వ‌డంతో ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని ఫిక్స్ అయ్యారు. వీరి పెళ్లి భార‌తీయ సంస్కృతిలో అద్భుతంగా జ‌రిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబ స‌భ్యులు ఒప్పుకున్నారు.

You may also like