హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరధిలోని హస్తినాపురంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో యువతి ఇంటికి వెళ్లి ఆమెపై ఏకంగా కత్తితో 18 సార్లు యువకుడు దాడి చేశాడు. ఆ ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను హస్తినాపురం సెంటర్‌లో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
వివరాల్లోకి వెళ్లితే.. వికారాబాద్ దౌల్తాబాద్ మండలంలోని చందంపేటలో నివాసం ఉండే శిరీష అదే మండలంలో ఉండే బసవరాజుతో నివాసం ఉండే శిరీష, బసవరాజులు గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. అయితే ఈ మధ్యలోనే శిరీషకు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బసవరాజు ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో యువతిపై దాడికి దిగాడు. గతంలో మేము ఇద్దరం ప్రేమించుకున్నామని బాధితురాలు పేర్కొన్నది. నాకు ఆల్రెడీ వేరే వ్యక్తి తో ఎంగెజ్మెంట్ అయ్యింది. ప్రేమించిన సమయంలో ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరు అని చెప్పాను. నాకు ఫోన్ కూడ చేయవద్దని బస్వరాజు కు చెప్పానని వివరించింది. ఫోన్ చేయకపోతే చంపేస్తాను అని బ్లాక్ మెయిల్ చేసాడు బసవరాజు. నన్ను చాకుతో విచక్షణ రహితంగా పొడిచాడు. నన్ను పొడిచే సమయంలో ఎవరు కూడ అడ్డుకోలేదని రోధిస్తూ తన గోడును వెల్లబోసుకున్నది.
Advertisement
Advertisement
గతంలో వీరిద్దరి ప్రేమ వ్యవహారం శిరీష ఇంట్లో తెలియడంతో వీరి వివాహానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ తరుణంలోనే శిరీషను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని వనస్థలిపురం వసతి గృహంలో చేర్పించారు. వసతి గృహంలో ఉంటూ ప్రయివేటుగా ఉద్యోగం చేసుకుంటుంది యువతి. ఈ విషయాన్ని తెలుసుకున్న బసవరాజు తన మకాంను హైదరాబాద్ మార్చుకున్నాడు. ఇదిలా ఉండగానే కుటుంబ సభ్యులు చెప్పినట్టు విని శిరీష శ్రీరామ్ అనే వ్యక్తితో కొద్ది రోజుల క్రితమే నిశ్చితార్థం చేసుకుంది.
నిశ్చితార్థం జరిగిందని జీర్ణించుకోలేక బసవరాజ్ పదే పదే ఫోన్ చేశాడు శిరీషకు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని, నాకు ఫోన్ చేయవద్దని నచ్చజెప్పినా వినలేదు. దీంతో తనతో మాట్లాడకపోతే చంపేస్తాను అని బెదిరించేవాడు బసవరాజ్. ఇవాళ యూసూఫ్‌గూడ నుంచి ఉద్యోగం ముగించుకొని వసతిగృహానికి వస్తున్న క్రమంలో కాపు కాసి ఉన్న బసవరాజు శిరీషను విచక్షణ రహితంగా దాదాపు 18 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో తీవ్రగాయాలయ్యాయి శిరీషకు. హస్తినాపురం నవీన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది.
కత్తిపోట్లకు గురైన శిరీష పరిస్థితి గురించి 24గంటలు గడిస్తే కానీ చెప్పలేమని, ఆమె ఊపిరితిత్తులు, కడుపులో బలంగా గాయాలయ్యాయి. స్కానింగ్ రిపోర్ట్‌లు వస్తే ఆమెకు సర్జరీ చేయాలా లేదా అనే విషయం తెలుస్తుందని.. ప్రస్తుతం ఐసీయూ వార్డులో చికిత్స అందిస్తున్నాం అని నవీన ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ రణదీర్ రెడ్డి వెల్లడించారు.