Home » జూనియర్ ఎన్టీఆర్ కు తల్లిగా ప్రియమణి.. అసహనంలో ఫ్యాన్స్!

జూనియర్ ఎన్టీఆర్ కు తల్లిగా ప్రియమణి.. అసహనంలో ఫ్యాన్స్!

by Bunty
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటన, డ్యాన్స్ తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారాడు ఎన్టీఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల కాంబోలో రాబోతున్న చిత్రం ‘దేవర’. ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక అప్డేట్ వైరల్ గా మారుతుంది.

Advertisement

హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించడానికి కొరటాల ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారట. ఎన్నో రిస్కులు చేసి చాలా అద్భుతమైన సీన్లను తెరకెక్కించడానికి కొరటాల నానా కష్టాలు పడుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటించనుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ కు తల్లిపాత్రలో ప్రియమణి నటించనుందట. ప్రియమణి గతంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించింది. ఎన్టీఆర్ కీ చిన్నప్పటి పాత్రలో ప్రియమణి తల్లి పాత్రలో నటించనుంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా ప్రియమణి జవాన్ సినిమాలో నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading