కండల వీరుడు సల్లూ బాయ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. సల్మాన్ ఖాన్ ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో ఇరుకున్నారు. ఓ జర్నలిస్ట్ పై సల్మాన్ ఖాన్ దాడి కేసు ఇప్పుడు తెరపైకి వచ్చింది. 2019లో జరిగిన ఓ వివాదం పై జర్నలిస్ట్ సల్మాన్ ఖాన్ పై ఫిర్యాదు చేశాడు. దాంతో తాజాగా సల్మాన్ ఖాన్ మరియు ఆయన బాడీ గార్డు నవాజ్ షేక్ లకు అందేరీ మెజిస్ట్రేట్ కోర్టు సమన్లను జారీ చేసింది.
Advertisement
వీరిద్దరి పై భారతీయ శిక్షాస్మృతి 504 కింద కేసు నమోదైంది. న్యాయస్థానం సమన్లు జారీ చేసి తదుపరి విచారణను ఎప్రిల్ 5కు వాయిదా వేసింది. తన పై దాడి చేసిన సల్మాన్ ఖాన్, నవాజ్ షేక్ లను కఠినంగా శిక్షించాలని జర్నలిస్ట్ అశోక్ పాండే తన ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సల్మాన్ తన సినిమాలతో బాలీవుడ్ లో ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నారు.
Advertisement
అంతే కాకుండా సిక్స్ బాడీ కలిగిన హీరోగా కూడా ఎంతగానో ఫేమస్ అయ్యారు. కేవలం భారత్ లోనే కాకుండా పాకిస్థాన్ తో పాటూ ఇతర దేశాల్లోనూ సల్మాన్ ఖాన్ కు భారీగా అభిమానులు ఉన్నారు. అయితే సల్మాన్ ఖాన్ సినిమాలతో పాటూ తరచూ వివాదాలతోనూ వార్తల్లోనూ నిలుస్తుంటారు. అప్పట్లో సల్మాన్ హిట్ అండ్ రన్, జింకల వేట కేసులో కూడా ఇరుకున్న సంగతి తెలిసిందే.