కరోనా పుట్టినిల్లయిన చైనా మళ్లీ కరోనాతో అతలాకుతలమవుతోంది. ప్రారంభ రోజులతో పోలిస్తే కేసులు రెట్టింపు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలతో పాటుగా ప్రభుత్వ అధికారులు కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం చైనా తూర్పు ప్రాంతంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి.
Advertisement
తూర్పు తీరంలో ఉన్న షాంఘై నగరంతో పాటుగా మరో 23 చిన్న నగరాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారట. ఏప్రిల్ మొదటివారంలోనే ప్రతిరోజు 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయని, షాంగై నగరంలో కఠిన లాక్ డౌన్ అమలు చేశారు అధికారులు. దీంతో రవాణా వ్యవస్థ, విదేశీ విమాన రాకపోకలు నిలిచిపోయాయి.
Advertisement
గత 23 రోజులుగా విధించిన లాక్డౌన్ వల్ల ప్రజలు కనీస అవసరాలకు కూడా తీర్చుకో లేకపోతున్నారు. కొంతమంది ఆకలిని తట్టుకోలేక సమీపంలోని ఆహార కేంద్రాల మీద పడి దోచుకుంటున్నారు. కనీసం తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితుల్లో ఆ నగరవాసులు ఉన్నారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు గమనించి డబ్ల్యుహెచ్వో తో సంబంధం లేకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు విశ్లేషకులు తెలియజేస్తున్నారు.