సాధారణంగా వైరస్ లు తమ రూపాన్ని మార్చుకుంటూ ఉంటాయి కాబట్టి వైరస్ లకు సరైన మందును శాస్త్రవేత్తలు కనిపెట్టలేక పోతున్నారు. ఇక చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి కూడా వైరసే కాబట్టి దానికి కూడా సరైన మందులు ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు. కాగా మాయదారి కరోనా వైరస్ ఇప్పుడు మళ్లీ కొత్త రూపాన్ని సంతరించుకున్న సంగతి తెలిసిందే. ఈ వేరియంట్ “ఒమ్రికాన్” అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ వేరియంట్ కారణంగానే ప్రపంచం వణికిపోతోంది. ఇక ఈ వేరియంట్ నంబర్ 9 కాగా ఇప్పటివరకు మొత్తం 8 వేరియంట్ లు పుట్టుకొచ్చాయి ఇవి ఏవో ఇప్పుడు చూద్దాం..
Advertisement
ఆల్ఫా : యూకే లోని కెంట్ లో 2020 సెప్టెంబర్ లో ఈ వేరియంట్ ను గుర్తించారు. ఈ వేరియంట్ బ్రిటన్ దేశంలో సెకండ్ వేవ్ ను తీసుకువచ్చింది.
Advertisement
బీటా : దీనిని దక్షిణాఫ్రికాలో గుర్తించారు. 2020 మేలో దీన్ని గుర్తించారు. ప్రపంచ దేశాల్లో 50శాతం కేసులను బీటా వేరియంట్ పెంచేసింది.
గామా : 2020 నవంబర్ లో బ్రెజిల్ దేశంలో ఈ వేరియంట్ ను గుర్తించారు. దక్షిణమెరికాలో దీని వ్యాప్తి ఎక్కువగా కనిపించింది.
డెల్టా : భారత్ ను ముప్పుతిప్పలు పెట్టిన వేరియంట్ ఇది. 2020 అక్టోబర్ లో ఈ వైరస్ ను మొదటిసారిగా గుర్తించారు. ఆసియా, యూరప్ లో ఈ వైరస్ విజృంభించింది. ఇక ఇప్పటి వరకు వచ్చిన వేరియంట్ లలో ఇదే అత్యంత ప్రమాదకారిగా గుర్తించారు.
ఈటా : ఈ వేరియంట్ ను 2020 డిసెంబర్ నెలలో యూకేలో గుర్తించారు. ఇది 72 దేశాలకు విస్తరించింది.
లోటా : 2020లో లోటా వేరియంట్ బయటపడింది. అయితే ఇది పెద్దగా ప్రభావం చూపించలేదు.
కప్పా : ఇండియాలో 2020 అక్టోబర్ నెలలో కప్ఫా వేరియంట్ ను గుర్తించారు. 50 దేశాల్లో ఈ వేరియంట్ విస్తరించింది.
లంబ్డా : 2020 డిసెంబర్ నెలలో పెరూ దేశంలో దీనిని గుర్తించారు. మూడు నెలల్లోనే ఈ వేరియంట్ 41 దేశాలకు విస్తరించింది.