Congress Guarantees : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని…. ఎన్నికల్లో చెప్పి… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే… కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు ఇచ్చారు ప్రజలు. తొమ్మిది సంవత్సరాలు పరిపాలించిన… కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించారు తెలంగాణ ప్రజలు. అయితే ఎన్నికలలో ఇచ్చిన హామీలను.. నెరవేర్చుకునే పనిలో పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఆరు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది.
Advertisement
అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవారు ఇప్పుడు అప్లై చేసుకుంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు ఇతర రాష్ట్రాలలో కొంతమంది సెటిల్ అయ్యారు. మరి వారి పరిస్థితి ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో స్థిరపడిన వారు కూడా… దరఖాస్తు పెట్టుకోవచ్చు అని చెబుతున్నారు అధికారులు. అయితే వారే ఇక్కడికి వచ్చి అప్లై చేసుకోకుండా… తమ బంధువుల ద్వారా డాక్యుమెంట్స్… అధికారులకు అప్పగిస్తే సరిపోతుందట. ముఖ్యంగా అప్లికేషన్ నింపేటప్పుడు గృహిణి పేరుతో ఉంటే అని చెబుతున్నారు అధికారులు.
6 గ్యారెంటీల సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్లు.. తమ కుటుంబ సభ్యుల చేత అధికారులకు అప్పగిస్తే సరిపోతుందట. కాగా….ఆరు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ఆరు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆ తర్వాత కూడా ఈ తేదీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక ఆరు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్న తరుణంలో.. మీ-సేవ, ఆన్ లైన్ సెంటర్ల దగ్గర జనాలు విపరీతంగా ఉంటున్నారు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!