Home » ఒక్కో LIC పాలసీకి… ఏజెంట్ కి ఎంత కమీషన్ వ‌స్తుంది?

ఒక్కో LIC పాలసీకి… ఏజెంట్ కి ఎంత కమీషన్ వ‌స్తుంది?

by Azhar
Ad

LIC నేడు భార‌త‌దేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్ధ‌. LIC ఈ రేంజ్ కు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం వారి ఏజెంట్లు! ఆ ఏజెంట్లు అంతగా ప‌నిచేయ‌డానికి కార‌ణం కంపెనీ ఇచ్చే క‌మీష‌న్లు! ఒక్క పాల‌సీ క‌ట్టండి అంటూ ఆ ఏజెంట్లు ఎందుకు అంత‌లా ఇన్సిస్ట్ చేస్తారో అనే అనుమానం మీకెప్పుడైనా వచ్చిందా? అయితే ఒక్కో పాల‌సీకి వారికొచ్చే క‌మీష‌న్ ను ఒక్క‌సారి చూడండి. ఆ డౌట్ కు ఆన్స‌ర్ దొరుకుతుంది.

ఎండోమెంట్:

Advertisement

Advertisement

  • ఎండోమెంట్ రకం పాలసీపై ఏజెంట్ల‌కు 25% కమీషన్ వస్తుంది (కాల వ్య‌వ‌ధి 15 సంవ‌త్స‌రాల పైన ఉంటే)
  • కాల‌వ్య‌వ‌ధి 10–14 సంవ‌త్స‌రాలుంటే కమీషన్ 20% వ‌స్తుంది
  • కాల‌వ్య‌వ‌ధి 5–9 సంవ‌త్స‌రాలుంటే క‌మీష‌న్ 14% వస్తుంది
  • సింపుల్ గా చెప్పాలంటే….. ల‌క్ష క‌డితే 20 వేలు వ‌స్తాయి.

మనీ బ్యాక్ పాలసీలపై:

  • టోట‌ల్ గా 15% కమీషన్, సింగిల్ ప్రీమియం పాలసీ ల పైన 2% వరకు కమీషన్ వస్తుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై :
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై 2% కమీషన్ వ‌స్తుంది. రెగ్యులర్ పాలసీల పైన 20% కమీషన్ తో పాటు కమీషన్ పై 40% బోనస్ కమీషన్ వ‌స్తుంది. ఇలా నెలలో ఎన్ని పాలసీలు చేయిస్తే అతనికి అంత లాభం ఉంటుంది.

Visitors Are Also Reading