నచ్చితే పొగడటం, నచ్చకపోతే తిట్టిపోయడం నెటిజన్లకు అలవాటే. సోషల్ మీడియా వచ్చాక విమర్శలు మరీ హద్దుదాటిపోతున్నాయి. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలను ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. వారి ఆకృతి నుంచి డ్రెస్సింగ్, మాట తీరు, ప్రవర్తన.. ఇలా అన్ని రకాలుగా విమర్శిస్తున్నారు. కొందరూ ఈ ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోకపోయినా మరికొందరూ మాత్రం ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్లు ఇస్తుంటారు.
Advertisement
తాజాగా హీరోయిన్ ప్రియమణి ఈ ట్రోలింగ్‌పై స్పందిస్తూ.. చాలా మంది సోషల్ మీడియాలో ఏమి అనాలనిపిస్తే అది అనేసే హక్కు ఉందని ఫీలవుతారు. నిజానికి నా మీద వచ్చే మీమ్స్ చూసి నవ్వుకునేదాన్ని. కానీ కొన్ని హద్దు మీరుతూ ఇష్టారీతిన చేసే కామెంట్లు చూసి భరించలేకపోయే దాన్ని. అలాంటప్పుడు వెంటనే వాళ్లను బ్లాక్ చేసే దానిని. ఎందుకంటే సోషల్ మీడియానే జీవితం కాదు. అది కేవలం లైఫ్‌లో ఓ భాగం మాత్రమే. అభిమానులు నన్ను ఇష్టపడ్డా, ఇష్టపడకపోయినా మరేం పర్వాలేదని చెప్పుకొచ్చింది.
Advertisement
శరీరాకృతి గురించి మాట్లాడుతూ.. పెద్ద పెద్ద వర్కవుట్స్ చేయాలని నేనెప్పుడూ చెప్పను. మీరు ప్లస్ సైజ్‌లో ఉన్నా కూడా పర్వాలేదు. కాకపోతే ఖాళీగా ఫోన్లుచూస్తూ కూర్చునే బదులు మనకు ఏదవసరమో అది చేస్తే బాగుంటుంది. ఆ సమయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఉపయోగిస్తే బెటర్. చిన్న చిన్న వర్కవుట్స్ లేదా ఇంటి పనులు చేసినా సరిపోతుందని పేర్కొంది ప్రియమణి.
Also Read : పూరి హిట్ సినిమాల బడ్జెట్ & కలెక్షన్స్! పైసా వసూల్ డైరెక్టర్!!