స్క్రీన్ పై కనిపిస్తూ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం అంత ఈజీ కాదు. తమ ముఖంలో లేని విచిత్రమైన హావభావాలను పలికిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఆకట్టుకునే వాడే కమెడియన్. ఒక సినిమా సక్సెస్ కావాలి అంటే హీరో హీరోయిన్స్ ఎంత ముఖ్యమో.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్ కూడా అంతే అవసరం. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ ఎంతోమంది ఉన్నారు. వారిలో సత్య కూడా ఒకరు.
ఇటీవల విడుదలైన నాగశౌర్య రంగబలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశారు సత్య. సత్య స్క్రీన్ మీద కనిపిస్తే చాలు.. వెరైటీ ఎక్స్ప్రెషన్ తో సైలెంట్ గా ఆయన వేసే పంచులకు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా చూసిన వారు సైతం ఐ బీపీ ఉన్నవారు సత్య కామెడీ ని చూస్తే చాలు ఎటువంటి మందులు లేకుండా బీపీ కంట్రోల్ అయిపోతుందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement
ఇక ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా సత్య యాంకర్స్ ని ఇమిటేట్ చేస్తూ బాగా ఆకట్టుకున్నారు. ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సత్య సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలోని ఈయన ఇండస్ట్రీలోకి రాకముందు హైదరాబాదులో చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం గడిపేవారట. ఆ సమయంలోనే అవకాశాల కోసం అన్నపూర్ణ స్టూడియో చుట్టూ చక్కర్లు కొట్టేవారట. అప్పటికే సినిమాలు మరియు జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనరాజ్ సత్యను జబర్దస్త్ కార్యక్రమంలోకి తీసుకురావటం జరిగింది. జబర్దస్త్ లో కొంతకాలం పాటు సందడి చేసినటువంటి సత్య ఆ తరువాత సినిమా అవకాశాలు రావడంతో కమెడియన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.