టాలీవుడ్ ప్రేక్షకులకు రాహుల్ రామకృష్ణని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి, మహేష్ బాబు భరత్ అనే నేను, జాతి రత్నాలు వంటి సినిమాల్లో తన కామెడీతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న రాహుల్ రామకృష్ణ తాజాగా తండ్రి అయ్యారు.
Advertisement
ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తెలియజేశారు. సంక్రాంతి పండుగ రోజున కొడుకు పుట్టాడని తెలియజేస్తూ సంక్రాంతి రిలీజ్ అని తల్లి దగ్గర ఉన్న చిన్న పిల్లాడి ఫోటోతో పాటు కామెంట్ ను జత చేశాడు. దీంతో నెటిజన్స్ అందరూ రాహుల్ రామకృష్ణకు కంగ్రాట్యులేషన్ అని చెబుతున్నారు. కొన్ని రోజుల ముందు భార్యను పరిచయం చేస్తూ ఆమెతో లిప్ లాక్ చేస్తున్న ఫోటోను షేర్ చేసారు రాహుల్ రామకృష్ణ.
Advertisement
దీనిపై కొందరు నెటిజన్స్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత సరేలే ఎలాగూ పెళ్లి చేసుకోబోయే అమ్మాయే కదా అని మరికొందరు విషెస్ కూడా చెప్పారు. మరి ఆమెను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో తెలియదు కానీ తన భార్య ప్రెగ్నెంట్ అని చెప్పి ఈరోజు అందరికీ షాక్ ఇచ్చారు రాహుల్. ‘మా లిటిల్ ఫ్రెండ్ కి హాయ్ చెప్పండి’ అంటూ తన భార్య ప్రెగ్నెంట్ గా ఉన్న ఫోటోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొడుకు పుట్టాడంటూ న్యూస్ ను చెప్పేసాడు.
READ ALSO : Kalyanam Kamaneeyam Telugu Review : కళ్యాణం కమనీయం రివ్యూ