నందమూరి తారకరామారావు నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో బాలకృష్ణ. చిన్నవయసులోనే బాలకృష్ణ తండ్రి వద్ద నటనలో ఓనమాలు నేర్చుకున్నారు. ఎన్టీఆర్ స్వయంగా బాలయ్యకు నటనలో మెలకువలు నేర్పించారు. ఇక బాలయ్య కూడా తండ్రి బాటలో నడిచి మూడో తరం హీరోలలో స్టార్ హీరోగా ఎదిగారు. లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం ఒకేరకమైన పాత్రల్లో నటించకుండా బాలయ్య అన్ని రకాల పాత్రలలో నటించి మెప్పించారు.
Advertisement
తండ్రి లాగే ఎన్టీఆర్ కూడా పౌరాణిక పాత్రలతో అభిమానులను అలరించారు. బాలయ్య కెరీర్ లో ఆదిత్య 369, ముద్దుల మావయ్య, లెజెండ్, సింహా లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నాయి. కేవలం సినిమాల ద్వారానే కాకుండా రాజకీయాల్లోనూ బాలయ్య రాణిస్తున్నారు. ఓటమి ఎరగని నాయకుడిగా ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య సినిమా కారణంగా పూర్తిగా రాజకీయాలకు సమయం కేటాయించడం లేదు. ప్రస్తుతం ఆయన హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.
Advertisement
ఇక బాలయ్య బయట కోపంగా కనిపించినా ఆయన మనసు చాలా మంచిదని ఆయనతో కలిసి నటించినవాళ్లు చెబుతుంటారు. బాలయ్య ది చిన్నపిల్లాడి మనస్తత్వం అని అంటూ ఉంటారు. ఇదిలా ఉండగా బాలయ్య సినిమాలలో ఒక కామన్ పాయింట్ ఉంది. బాలయ్య తన సినిమాలలో వరుస ఆఫర్ లతో బిజీ ఉండే నటులు..ఇతర భాషీయుల నటుల కంటే తెలుగు వారికి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారికే ఆఫర్ లు ఇస్తుంటాడు.
దర్శకనిర్మాతలకు కూడా బాలయ్య ముందే ఆ విషయాన్ని చెబుతాడు. అలా తెలుగు వారికి ఆఫర్ ల కోసం ఎదురు చూస్తున్నవారికి అవకాశం ఇవ్వడం వల్ల కొత్తవారికి ఛాన్స్ ఇచ్చినట్టు అవ్వడంతో పాటూ వారి టాలెంట్ నిరూపించుకోవడానికి ఒక్క ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఈ ఒక్క విషయం చాలేమోకదా జై బాలయ్య అనడానికి.
ALSO READ : ఈ ముగ్గురు నటుల విషయంలో జరిగిన విచిత్రమైన ఘటన ఏంటో తెలుసా..?