ఒక్క సినిమా అంటే అందులో కేవలం హీరో, హీరోయిన్ మాత్రమే కాకుండా.. ఇంకా చాలా ముఖ్యమైన పాత్రలో అనేవి ఉంటాయి. కానీ ప్రతి సినిమాలో హీరో, హీరోయిన్ ఉన్న విధంగానే కమెడియన్ పాత్ర కూడా ఉంటుంది. ఇక ఒక్కపుడు తెలుగు కమెడియన్ అనగానే.. కేవలం బ్రహ్మానందం, ఆలీ పేర్లు మాత్రమే ఎక్కువగా గుర్తకు వచ్చేవి. కానీ ఇప్పుడు మన తెలుగులో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. అయితే అందులో కొంతమంది హీరోలుగా అవకాశాలు అందిపుచ్చుకొని…. మొదటి సినిమాతో హిట్స్ కొడుతున్నారు.
Advertisement
ఇక ఆ తర్వాత నుండి మళ్ళీ కమెడియన్ పాత్రలు చేయడం లేదు. ఇప్పుడు అదే దారిలో కలర్ ఫొటో హీరో సుహాస్ కూడా ఉన్నాడు. అయితే సుహాస్ హీరోగా నటించిన ఈ కలర్ ఫొటో సినిమా ఆహలో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఇందులో సుహాస్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ సినిమా తర్వాత నుండి సుహాస్ మళ్ళీ కమెడియన్ గా కనిపించలేదు. అయితే ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏమిటంటే.. ఇక నుండి సుహాస్ కేవలం హీరోగానే సినిమాలు చేయాలనీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే కమెడియన్ గా అవకాశం వచ్చిన సుహాస్ నో చెబుతున్నట్లు తెలుస్తుంది.
Advertisement
అయితే ఇలాగె హీరోగా ఒక్కే సినిమా హిట్ కావడంతో కేవలం హీరో సినిమాలే అంటూ.. సునీల్, సప్తగిరి కూడా వెళ్లారు. కానీ ఆ తర్వాత వారి సినిమాలు అన్ని ప్లాప్ కావడంతో మళ్ళీ కమెడియన్ గానే పాత్రలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వీరి కామెడీ అనేది అంతా పండటం లేదు. ఇక కమెడియన్ ఆలీ హీరోగా 50 సినిమాలు చేసిన.. కామెడీ అనేది వదిలిపెట్టలేదు. అందుకే సుహాస్ కూడా ఇటు కామెడీ చేస్తూనే.. హీరోగా చేయాలనీ చాలా మంది అభిమానులు సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు సుహాస్ హీరోగా…అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు, రైటర్ పద్మభూషణ్ అనే సినిమాలు తెరకెక్కుతున్నాయి.
ఇవి కూడా చదవండి :