Home » తెలంగాణ‌లో ఉద్యోగాల జాత‌ర‌.. ఏయే జిల్లాలో ఎన్ని..? శాఖ‌ల వారిగా వివ‌రాలు ఇవే..!

తెలంగాణ‌లో ఉద్యోగాల జాత‌ర‌.. ఏయే జిల్లాలో ఎన్ని..? శాఖ‌ల వారిగా వివ‌రాలు ఇవే..!

by Anji
Ad

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాత‌ర మొద‌లైంది. నిరుద్యోగుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీపి క‌బురు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 91,142 ఉద్యోగ ఖాళీలున్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాల‌కు ఈరోజే నోటిఫికేష‌న్ల‌ను జారీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు. మిగిలిన 11.103 కాంట్రాక్టు ఉద్యోగుల‌ను రెగ్యుల‌రైజ్ చేయ‌నున్న‌ట్టు చెప్పారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కే వ‌స్తాయ‌ని.. 5 శాతం మాత్ర‌మే స్థానికేత‌రుల‌కు వ‌స్తాయ‌ని వివ‌రించారు.

Advertisement

ఉద్యోగ అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌యోప‌రిమితిని పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఉద్యోగ అభ్య‌ర్థుల వ‌యోప‌రిమితి ప‌దేళ్ల‌కు పెంచింది. ఓసీ అభ్య‌ర్థుల‌కు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్య‌ర్థుల‌కు 49 ఏళ్లు, దివ్యాంగ అభ్య‌ర్థుల‌కు 54 ఏళ్లు, ఎక్స్ స‌ర్వీస్‌మెన్ల‌కు 47 ఏళ్ల వ‌ర‌కు వ‌యోప‌రిమితి పెంచారు.

మ‌ల్టీజోన‌ల్ పోస్టులు -13,170
స‌చివాల‌యం, హెచ్ఓడీలు, విశ్వ‌విద్యాల‌యాల్లో 8,147
క్యాడ‌ర్ వారిగా ఖాళీలు
గ్రూప్ -1 503 ఉద్యోగాలు
గ్రూప్ -2 582 ఉద్యోగాలు
గ్రూప్‌-3 1,373
ఉద్యోగాలు గ్రూపు-4 9,168 పోస్టులు
జిల్లాల వారిగా ఖాళీలు

హైద‌రాబాద్ -5268
నిజామాబాద్ -1976
మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి -1769
రంగారెడ్డి – 1,561
క‌రీంన‌గ‌ర్ -1465
న‌ల్ల‌గొండ -1368
కామారెడ్డి -1340
ఖ‌మ్మం – 1340
భ‌ద్రాద్రి కొత్త‌గూడం -1316
నాగ‌ర్ క‌ర్నూల్ -1,257
సంగారెడ్డి – 1,243
మ‌హ‌బూబ్ న‌గ‌ర్ – 1,213
ఆదిలాబాద్ – 1,193
సిద్దిపేట – 1,178
మ‌హ‌బూబాబాద్ -1,172
హ‌న్మ‌కొండ – 1,157

మెద‌క్ – 1,149

జ‌గిత్యాల – 1,063

మంచిర్యాల – 1,025

యాదాద్రి భువ‌న‌గిరి -1,010

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి – 918

నిర్మ‌ల్ – 876

వ‌రంగ‌ల్ -842

కుమ్రంభీం ఆసిఫాబాద్ -825

పెద్ద‌ప‌ల్లి – 800

జ‌న‌గాం -760

నారాయ‌ణ‌పేట – 741

వికారాబాద్ -738

సూర్య‌పేట -719

ములుగు -696
జోగులాంబ గ‌ద్వాల -662,
రాజన్న సిరిసిల్ల -601

వ‌న‌ప‌ర్తి -556

జోన్లు, మ‌ల్టీజోన్ల వారిగా ఖాళీల వివ‌రాలు..

Advertisement

కాళేశ్వ‌రం జోన్ మొత్తం.. 1,630

బాస‌ర జోన్ – 2,328

రాజ‌న్న జోన్ 2,403

భ‌ద్రాద్రి జోన్ -2,858

యాదాద్రి జోన్ – 2,160

ఛార్మినార్ జోన్ – 5,297

జోగులాంబ జోన్ – 2,190
మ‌ల్టీజోన్లు

మ‌ల్టీజోన్ 1 – 6,800

మ‌ల్టీజోన్ 2 – 6,370

శాఖ‌ల వారిగా వివ‌రాలు

హోంశాఖ 18,334

సెకండ‌రీ ఎడ్యూకేష‌న్ -13,806
హెల్త్‌, మెడిక‌ల్‌, ఫ్యామిలి వెల్పేర్ 12,755

హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ 7,878

బీసీల సంక్షేమం -4,311

రెవెన్యూ శాఖ‌ 3,560

ఎస్సీ వెల్పేర్ శాఖ -2,879

నీటి పారుద‌ల శాఖ 2692

ఎస్టీ వెల్పేర్ – 2,399
మైనార్టీస్ వెల్పేర్ -1,825
ఎన్విరాన్‌మెంట్ ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాల‌జి 1,598
పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 1,455

లేబ‌ర్‌, ఎంప్లాయిస్‌మెంట్ 1,221
ఆర్థిక శాఖ 1,146
మ‌హిళ‌లు, పిల్ల‌లు, దివ్యాంగులు, సీనియ‌ర్ సిటిజ‌న్స్‌-895
మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ 859
అగ్రిక‌ల్చ‌ర్, కో ఆప‌రేష‌న్ -801
ర‌వాణా, రోడ్లు, భ‌వ‌నాల శాఖ -563
న్యాయ‌శాఖ 386
ప‌శుపోష‌ణ‌, మ‌త్య్స విభాగం -353
జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ -343
ఇండ‌స్ట్రీస్, కామ‌ర్స్ -233
యూత్‌, టూరిజం, క‌ల్చ‌ర్ -184
ప్లానింగ్ -136
ఫుడ్‌, సివిల్ స‌ప్ల‌యిస్ -106
లెజిస్లేచ‌ర్ -25
ఎన‌ర్జీ -16

ప్ర‌తి ఏడాది ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్యాలెండ‌ర్ ఇప్ప‌టి నుండి ఖాళీల‌ను ముందే గుర్తించి ప్ర‌తీ సంవ‌త్స‌రం ఉద్యోగాల భ‌ర్తీ క్యాలెండ‌ర్‌ను ప్ర‌క‌టించి.. పార‌ద‌ర్శ‌కంగా.. నియామ‌కాలు చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ద‌ని సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. ఈ మేర‌కు అన్ని విభాగాలు త‌మ వ‌ద్ద ప్ర‌తి సంవ‌త్స‌రం ఏర్ప‌డే ఖాళీల వివ‌రాల‌ను సిద్ధం చేసి.. నోటిఫికేష‌న్ల‌ను జారీ కోసం ఆయా నియామ‌క సంస్థ‌ల‌కు స‌మాచారం ఇస్తామ‌ని తెలిపారు. త‌ద్వారా నోటిఫికేష‌న్లు విడుద‌ల‌వుతాయ‌ని అన్నారు. ఉద్యోగార్థులు అన్ని నియామ‌క ప‌రీక్ష‌ల్లో పోటీ ప‌డేందుకు వీలుగా నియామ‌క ప‌రీక్ష‌ల మ‌ధ్య‌లో త‌గిన వ్య‌వ‌ధి ఇస్తూ నోటిఫికేష‌న్ల‌ను విడుద‌ల చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని సీఎం తెలిపారు.

Also Read : తెలంగాణ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 91,147 ఉద్యోగాలు ఖాళీలు..! 

Visitors Are Also Reading