Home » సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డినే ఓడించిన మొనగాడు ఇతనే…వీడు మగాడు రా బుజ్జి !

సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డినే ఓడించిన మొనగాడు ఇతనే…వీడు మగాడు రా బుజ్జి !

by Bunty
Ad

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. దాదాపు 65 సీట్లతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. అటు భారత రాష్ట్ర సమితి పార్టీకి 39 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ మరియు భారత రాష్ట్ర సమితి పార్టీకి మధ్య ఓటు షేర్ కేవలం రెండు శాతం మాత్రమే. అంటే కాంగ్రెస్ పార్టీ విజయం పెద్ద గొప్పదని కాదన్నమాట. అటు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో దాదాపు 30 వేల మెజారిటీతో విజయం సాధించారు.

cm kcr and revanth reddy defeated in kamareddy

cm kcr and revanth reddy defeated in kamareddy

ఇటు గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఈటెల రాజేందర్ పై అఖండ విజయాన్ని అందుకున్నారు. అయితే కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వాళ్లను కూడా బిజెపి అభ్యర్థి ఓడించి అరుదైన ఘనత సాధించాడు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరియు రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలలో కామారెడ్డి లో కూడా పోటీ చేశారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారని అందరూ అనుకున్నారు.

Advertisement

Advertisement

కానీ కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఓటర్లు అనూహ్యంగా బిజెపి పార్టీకి పట్టం కట్టారు. కామారెడ్డి నియోజక వర్గంలో బిజెపి అభ్యర్థి అయిన వెంకటరమణారెడ్డి 5810 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నాన్ లోకల్ కారణంగా సీఎం కేసీఆర్ మరియు రేవంత్ రెడ్డికి కామారెడ్డి ప్రజలు ఓటు వేయలేదని తెలుస్తోంది. కానీ వెంకటరమణ రెడ్డి బిజెపి పార్టీ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే కామారెడ్డి లోకల్ కావడంతో వెంకట రమణారెడ్డి గ్రాండ్ విక్టరీ కొట్టారు. దీంతో ఇప్పుడు వెంకటరమణ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారారు.

 

Visitors Are Also Reading