ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విపక్షాలపై దూకుడు పెంచారు. ఎన్నికలు మరో ఏడాది ఉన్న నేపథ్యంలో బహిరంగ సభల్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన లపై విరుచుకుపడుతున్నారు సీఎం జగన్. ఈ నేపథ్యంలోనే ఇవాళ వైయస్సార్ మత్స్య భరోసా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్…. ఇక చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Advertisement
బిజెపి తో, కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకునేది వీళ్లే…విడిపోయే ది వాళ్ళే…పెళ్ళిళ్ళు చేసుకునేది వెళ్లే విడాకులు ఇచ్చేది వీళ్లే…. అంటూ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏం చెపితే దానికి తల ఆడించడం ఒక్కటే దత్త పుత్రుడి తెలిసిందన్నారు. బిజెపి కి భయ పడే బిజెపి పక్క కు పవన్ చేరాడు..చంద్రబాబు చెపితే బిజెపికి దత్త పుత్రుడు విడాకులు ఇస్తాడు అని చురకలు అంటించారు. రాజకీయాల్లో విశ్వసనీయత కావాలి..గజ దొంగల ముఠా లో దుష్ట చతుష్టయం ఉందనీ ఫైర్ అయ్యారు.
కర్ణాటక లో కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు బ్యాచ్ సంబరాలు జరుపుకున్నారు..మళ్లీ అదే బిజెపి తో కలవాలని తపన పడుతున్నారనీ నిప్పులు చెరిగారు సీఎం జగన్. చంద్రబాబు చేయబోతున్న యుద్ధం జగన్ తో కాదు జనం తో అంటూ రెచ్చిపోయారు. దోచుకున్న సంపద దాచుకోవాలని దిక్కు మాలిన ఆలోచన గజ దొంగలదన్నారు సీఎం జగన్.