ఏపీలో జిల్లాలో పునర్వ్యవస్థీకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వ్యవస్థీకరణ నేపథ్యంలో విజయవాడ జిల్లా కేంద్రానికి సీఎం జగన్ ఎన్టీఆర్ పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దాంతో నందమూరి అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా నందమూరి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు లోని ఎన్టీఆర్ బంధువులు సీఎం జగన్ ను క్యాంప్ కార్యాలయం లో కలిశారు. అంతే కాకుండా విజయవాడ జిల్లా కేంద్రానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం పై కృతజ్ఞతలు చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో నిమ్మకూరు గ్రామస్తులకు విజయవాడ జిల్లా కేంద్రానికి ఎన్టీఆర్ పేరు ను పెడతానని హామీ ఇచ్చారని తెలుస్తోంది. దాంతో అప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు గానూ సీఎం ను కలిసి గ్రామస్థులు మరియు నందమూరి బంధువులు కృతజ్ఞతలు చెప్పారు. అంతే కాకుండా నిమ్మకూరు గ్రామంలో ఉన్న సమస్యలను గ్రామస్థులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో మంచినీటి వసతి కోసం నిధులు సమకూర్చాలని కోరారు.
Advertisement
Advertisement
దాంతో సీఎం జగన్ నిమ్మ కూరు గ్రామంలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఖర్చులకు వెనకాడకుండా వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పారు. దాంతో పాటూ నిమ్మకూరులోని 14 ఎకరాల చెరువులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరారు. ఎన్టీఆర్ 100వ పుట్టిన రోజు నాటికి నిమ్మకూరులో 100 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. వచ్చే నెల 28 నాటికి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.